Featured

Venkaiah Naidu : డైపర్లు మారుస్తున్నట్లుగా పార్టీలు మారుస్తున్నారు… విలువలు లేని రాజకీయ నాయకులు ఉన్నారు…: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Venkaiah Naidu : ఒకప్పటి రాజకీయాలతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయాలు చాలా మారిపోయాయి. ఒకప్పుడు విమర్శలు చేసుకున్నా చాలా హుందాగా చేసేవారు. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో దిగజారుడు తనం అలానే వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. అయితే ఒకపార్టీ గురించి వకాల్తా పుచ్చుకుని మాట్లాడిన నాయకులు తెల్లారే సరికల్లా మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఒక సిద్ధాంతం అని లేకుండా అవకాశం వద్ద రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకుల వ్యవహార శైలి, మాట తీరు గురించి మాజీ ఉప రాష్ట్రపతి వెకయ్య నాయుడు గారు తీవ్రంగా విమర్శించారు.

డైపర్లు మార్చినట్లు మారుస్తున్నారు…

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేసారు. ఇపుడున్న రాజకీయ నాయకులు విలువలు లేమి రాజకీయం చేస్తునానరంటూ విమర్శించారు. డైపర్లు పదే పదే చిన్నపిల్లలకు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారని అవకాశ వాద రాజకీయం చేస్తున్నారంటూ తెలిపారు. ఒక పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చాక చివరి దాకా అదే పార్టీలో ఉండాలంటూ తెలిపారు.

ఒకవేళ పార్టీ సిద్ధాంతాలు నచ్చక పోతే మారవచ్చు కానీ, పదవిలో ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి వెళ్లాలి అంతేకానీ పదవి ఉన్నట్లుగానే పార్టీ మారడం విలువలు లేని రాజకీయం అంటూ తెలిపారు. అదీ కాక భాష చాలా ముఖ్యమని, విమర్శలు చేసినా రాజకీయంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదంటూ చెప్పారు. అందుకే ప్రస్తుతం రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవం విశ్వాసం రెండూ లేవని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago