టాలీవుడ్ లో స్టార్ హీరో వెంకటేష్ కి ప్రత్యేకమైన శైలి ఉంది.. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పిచాలంటే అయినవళ్లే సాధ్యం.. అయన కెరీర్ లో సినిమాలు చూసుకుంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసిన సినిమాలే ఉంటాయి. ఇప్పుడు కూడా అయన సినిమాలు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తున్నట్లే ఉన్నాయి.. అందుకే అయన ఇంత పెద్ద స్టార్ హీరో అవగలిగారు. ఇకపోతే అయన ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఒకటి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోని నారప్ప సినిమా కాగా మరొకటి F3 ..
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ సినిమా F2 కి సీక్వెల్.. F2 సినిమా ప్రేక్షకులను ఏవిధంగా అలరించిందో అందరికి తెలిసిందే.. కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. అందుకేనేమో ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనీ నిర్ణయించారు.. వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా లో మరో కథానాయకుడు కాగా మరో హీరో కూడా ఈ సినిమా లో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.. అతను సాయి ధరమ్ తేజ్ అనే వార్తలు వస్తున్నాయి..
అయితే ఈ సినిమాకు గురించి మరో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో వెంకీకి రేచీకటి సమస్య ఉంటుందట. ఈ సమస్య మీదనే బోలెడంత ఫన్ జెనరేట్ చేస్తున్నారని, కళ్ళు కనిపించక వెంకీ చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. మరి ఆ కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. ఈ చిత్రం ఆగష్టు 27న రిలీజ్ కానుంది.ఇక ఎఫ్ 3తో పాటు లేటెస్ట్ గా మళయాళంలో వచ్చిన “దృశ్యం 2” రీమేక్‌లో నటిస్తున్నాడు. అక్కడ మోహన్ లాల్ హీరోగా నటించాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి మంచి పేరు తెచ్చుకుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…