Vittalacharya: గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే అద్భుతాలు సృష్టించిన విఠలాచార్య…. ఆస్కార్ ఎప్పుడో వచ్చేది!

Vittalacharya: ఒక సినిమా అన్ని రంగులను దిద్దుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమా విషయంలో డైరెక్టర్ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులుగా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో సీనియర్ డైరెక్టర్ విఠలాచార్య ఒకరు.

కన్నడ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో చేసినన్ని సినిమాలు సొంత భాషలో చేయకపోవడం విశేషం. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత డైరెక్టర్ విఠలాచార్యకు ఉందని చెప్పాలి. గ్రాఫిక్స్ లేని రోజుల్లో కూడా ఈయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. కేవలం కెమెరా టెక్నిక్ లు, మూమెంట్లతో అద్భుతాలు చేశారు. ఈ కాలంలో ఎంతో టెక్నాలజీ ఉండి కూడా చేయలేనటువంటి పనులను విఠలాచార్య బ్లాక్ అండ్ వైట్ సినిమాల సమయంలోనే చేశారు.

అప్పుడప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలోకి కలర్ సినిమాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో కలర్ సినిమా చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ ఈయన మాత్రం 1984 లో జై బైతాల అనే త్రీడీ సినిమాని చేశారు. విఠలాచార్య సినిమా అంటే పిశాచాలు, దెయ్యాలు గుర్తుకు వస్తాయి.

Vittalacharya: దయ్యాల సినిమాలకు కేరాఫ్ గా మారిన విఠలాచార్య..

మదన మోహిని, జగన్మోహిని, మోహినీ శపథం వంటి సినిమాలతో ఈయన ప్రేక్షకులకు కంటి పై కునుకు లేకుండా చేసిన ఘనత డైరెక్టర్ విఠలాచార్యకు ఉందని చెప్పాలి. ఇక ఈయన టెక్నాలజీ లేని సమయంలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించారు.ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పట్లో కనుక ఉంటే మనకు ఆస్కార్ అవార్డ్ ఎప్పుడో వచ్చేదని చెప్పాలి.