Featured

Bakka Judson : ఒకేసారి 16 మంది సినిమా వాళ్ళపై డ్రగ్స్ కేసు వేశారు… ఇదంతా కేటిఆర్ ప్లాన్…!

Bakka Judson : దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికి పట్టుబడ్డా, ఏదైనా విషయం డ్రగ్స్ కి సంబంధించినా ఆ కేసుకు తెలంగాణ రాష్ట్రానికి లింక్ ఉంటుందంటూ బక్క జడ్సన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉన్న బక్క జడ్సన్ ఈసారి ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఏకంగా బక్క జడ్సన్ తన రక్తం, వెంట్రుకలు అలానే గోర్లు వంటి నమూనాలను ఇచ్చి డ్రగ్స్ టెస్టు చేయండి అంటూ మీడియా ముందు పెట్టారు అలానే కేటీఆర్ కూడా తన రక్త ఇతరత్రా నమూనాలను ఇచ్చి టెస్టు చేయించుకోవాలని ఛాలెంజ్ చేసారు. ఇక సినిమా ఇండస్ట్రీ మీద డ్రగ్స్ కేసు విషయం మాట్లాడారు బక్క జడ్సన్.

16 మంది మీద డ్రగ్స్ కేసు అందుకే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేగి ఏకంగా 16 మందిని విచారించారు డ్రగ్స్ కేసులో. అందులో హీరో రవితేజ, ఛార్మి, రానా, పూరీ జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఉన్నారు. ఇక ఈ కేసులో వారి రక్త ఇతరత్రా నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి కొద్ది రోజులు వైరల్ చేసినా ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత ఏడాదికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ వెనుక డ్రగ్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అక్కడ తీగ లాగితే డొంక హైదరాబాద్ లో దొరికింది. ఇక్కడ ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించి ఈడీ విచారణకు కూడా హాజరైంది.

ఇదంతా జరిగాక కూడా హైదరాబాద్ లో తెలుగు ఇండస్ట్రీలోని వారిపై పెట్టిన డ్రగ్స్ కేసు ముందుకు కదలలేదు. దీనికి కారణం కేవలం సినిమా ఇండస్ట్రీ మీద పట్టు ఉంచుకోడానికి కేటీఆర్ చెసిన ప్లాన్ అంటూ బక్క జడ్సన్ అభిప్రాయపడ్డారు. ఆ కేసులో ఉన్న వారందరికీ సినిమా ఫంక్షన్స్ కి చీఫ్ గెస్ట్ గా కేటీఆర్ వెళ్తాడు అంటూ కామెంట్స్ చేసారు. అలా వెళ్లిన ఈవెంట్స్, పార్టీస్ కి సంబంధిచిన యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల లింక్స్ ఈడీ అధికారులకు ఇచ్చి కేటీఆర్ ను విచారించండి అని ఫిర్యాదు చేసినా రెండు రోజులకే డ్రగ్స్ కేసులో ఉన్న 16 మంది మీద కేసును రంగారెడ్డి కోర్ట్ కొట్టేసింది అంటూ బక్క జడ్సన్ ఆరోపించారు.

Bhargavi

Recent Posts

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

17 minutes ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

36 minutes ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

18 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

18 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

19 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

19 hours ago