Vittalacharya: ఒక సినిమా అన్ని రంగులను దిద్దుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమా విషయంలో డైరెక్టర్ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులుగా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో సీనియర్ డైరెక్టర్ విఠలాచార్య ఒకరు.
కన్నడ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో చేసినన్ని సినిమాలు సొంత భాషలో చేయకపోవడం విశేషం. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత డైరెక్టర్ విఠలాచార్యకు ఉందని చెప్పాలి. గ్రాఫిక్స్ లేని రోజుల్లో కూడా ఈయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. కేవలం కెమెరా టెక్నిక్ లు, మూమెంట్లతో అద్భుతాలు చేశారు. ఈ కాలంలో ఎంతో టెక్నాలజీ ఉండి కూడా చేయలేనటువంటి పనులను విఠలాచార్య బ్లాక్ అండ్ వైట్ సినిమాల సమయంలోనే చేశారు.
అప్పుడప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలోకి కలర్ సినిమాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో కలర్ సినిమా చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ ఈయన మాత్రం 1984 లో జై బైతాల అనే త్రీడీ సినిమాని చేశారు. విఠలాచార్య సినిమా అంటే పిశాచాలు, దెయ్యాలు గుర్తుకు వస్తాయి.
మదన మోహిని, జగన్మోహిని, మోహినీ శపథం వంటి సినిమాలతో ఈయన ప్రేక్షకులకు కంటి పై కునుకు లేకుండా చేసిన ఘనత డైరెక్టర్ విఠలాచార్యకు ఉందని చెప్పాలి. ఇక ఈయన టెక్నాలజీ లేని సమయంలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించారు.ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పట్లో కనుక ఉంటే మనకు ఆస్కార్ అవార్డ్ ఎప్పుడో వచ్చేదని చెప్పాలి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…