సుకుమార్ ‘పుష్ప’ కి మణిరత్నం మూవీకి లింక్ ఏంటి.. నిజంగా పుష్ప స్టోరీ ఇదేనా..??

సుకుమార్ పుష్ప సినిమాకి మణిరత్నం సినిమాకి నిజంగా లింక్ ఉందా..?అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఎర్ర చందనం స్మగ్లర్ వీరప్పన్ లైఫ్ స్టోరీని కాస్త అందమైన, ఆకర్షణీయమైన మెలికలు తిప్పి తనదైన స్టయిల్ తో రిచ్ కాస్టింగ్ తో విలన్ మూవీ చేశారు మణిరత్నం. అప్పట్లో ఆ మల్టీస్టారర్ సోసోగానే నడిచింది. సరిగ్గా ఎక్కలేదు ఆడియెన్స్ బుర్రలోకి. ఇప్పుడు దాదాపు అదే సెంట్రల్ లైన్ ని… సరికొత్త ట్రీట్మెంట్ తో ట్రై చేస్తున్నారా?

అయినా సుక్కూ చేస్తున్న పుష్ప మూవీకీ ఆ విలన్ కీ ఏదైనా రిలేషనుందా? అసలు కథ ఏంటంటే..శేషాచలం అడవులు.. ఎర్ర చందనం స్మగ్లర్లు.. పోలీసులతో పగలు ప్రతీకారాలు.. ఇవీ ప్రస్తుతానికి పుష్ప మూవీ స్టోరీ మీదొచ్చిన బేసిక్ హింట్స్. బట్.. ఇదంతా వింటే ఎక్కడో చూసిన కథలానే లేదూ అనే డౌట్లు మొదట్లో చాలానే పుట్టేశాయ్.లేటెస్ట్ గా వినిపించే ఫీలర్లు ఆ సందేహాల్ని ఇంకాస్త డెప్త్ లోకి తీసుకెళ్తున్నాయి.

చెల్లెలి చావుకి కారణమైన పోలీసాఫీసర్ కి గుణపాఠం చెప్పాలన్నది మణిరత్నం తీసిన విలన్ మూవీకి నేపథ్యం. అందులో విక్రమ్ హీరో అయితే చెల్లి పాత్రలో ప్రియమణి నటించారు. అదే సిస్టర్ సెంటిమెంట్ ని, అదే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సుక్కూ ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేశారట. పుష్పరాజ్ చెల్లిగా ఐశ్వర్య రాజేష్ ఓకే అయినట్లు కూడా ఓ టాక్ నడుస్తోంది. పుష్పరాజ్ ని ఢీకొట్టే పవర్ ఫుల్ అండ్ నెగిటివ్ జీల్ వున్న పోలీసాఫీసర్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కనిపించబోతున్నారు.

పుష్ప గురించి వినిపిస్తున్న ఈ కొత్త కథలో నిజమెంతనేది ఆ లెక్కల మేస్టారుకే తెలియాలి. ఇప్పుడైతే.. 60 పర్సెంట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి.. రిలీజ్ డేట్ కి పక్కాగా రెడీ చేసే ఆలోచనలో వున్నారు సుక్కూ..ఇక సినిమాని ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల మరోసారి వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.