టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి..చాలా కాలంగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఈమె.. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అవుతుంది.. ఏజ్ అయిపోయినా ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కొత్త కొత్త లుక్స్ తో కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేయటానికి తెగ తాపత్రయ పడుతుంది అనుకుంటాం గానీ, నిజానికి, సురేఖావాణికి ఇంకా నిండా నలబైయేనట.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా ఏళ్లుగా నటిస్తోంది కాబట్టి, ఆమెకు ఎప్పుడో నలబై దాటి ఉంటాయని అందరి అనుమానం.అయితే, ఆమె తన 40వ పుట్టిన రోజును బుధవారం ఘనంగా జరుపుకుని తన నిజమైన వయసును ప్రపంచానికి వెలుగెత్తి చాటింది. మరి నలభై ఏళ్లకే 21 ఏళ్ల కూతురు ఎలా ఉంది అంటే.. సురేఖా వాణికి 18 ఏళ్ల వయసులోనే పెళ్లి అయింది. వెంటనే కూతురు పుట్టింది. కూతురు సుప్రీతకిప్పుడు 21 ఏళ్ళు.
మొత్తానికి సురేఖా వాణి కూతురు, అలాగే సురేఖా ఫ్రెండ్స్ అందరూ కలిసి సురేఖా వాణి 40వ పుట్టిన రోజును గ్రాండ్ గా చేశారు.పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో సురేఖా వాణి కొత్త పెళ్ళికూరుతిలా తెగ మెరిసిపోతుంది. ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన ఫాలోవర్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి అన్నట్టు .. తనెత్తు కూతురు ఉన్నా.. సురేఖా వాణి గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఆ మధ్య వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ, తన పెళ్లి పై సురేఖా క్లారిటీ ఇచ్చింది అనుకోండి.కానీ ఇప్పటికీ సురేఖా వాణికి పెళ్లి ప్రపోజల్స్ మాత్రం తరుచుగా వస్తున్నాయి. ఓ ఒంటరి డైరెక్టర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నాడు. పాపం ఆ డైరెక్టర్ కి ఇంతవరకూ పెళ్లి కాలేదు, పైగా అతనిది మంచి క్యారెక్టర్. కాకపోతే తాగుడికి బానిస. ఒంటరితనం వల్లే తాగుబోతుగా మారాను అని, సురేఖా పెళ్ళికి ఓకే చెబితే తాగుడు కూడా మానేస్తాను అని ఆ డైరెక్టర్ అంటున్నాడట…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…