సీతాఫలంతో ఎన్నో వ్యాధులు దూరం.. కానీ దీనిని ఎప్పుడు తినాలో తెలుసా..

సీతాఫలంలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. కొన్ని రకాల వ్యాధులకు ఇది ఒక నివారిణి. ఇది మూడు నెలలకు పైగా లభిస్తుంది. సీజన్‌ వస్తోందంటే చాలు… కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం. దీనిలో ఎక్కువగా ప్రొటీన్లు, ఫ్యాట్లు లభ్యమవుతాయి.

వీటితో పాటు చాలా ఎక్కువ మోతాదులో విటమిన్ సి కూడా ఇందులో ఉంటుంది. ఏదైనా శరీరానికి గాయం అయినప్పుడు వాటిని మాన్పడంలోనే ఈ సీతాఫల పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ మెరుగపడటానికి.. మలబద్ధకంతో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుది. డయోరియాను కూడా తగ్గిస్తుంది. ఎముకలు గట్టిగా తయారు అవ్వడానికి కాల్షియం గుణాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా కీళ్లలోని యాసిడ్లను బయటకు తీసి.. కీళ్లనొప్పులు, రుమాటిజం వంటి వాటికి చెక్ పెట్టేస్తుంది.

నీరసంగా ఉన్నప్పుడు సీతాఫలం తింటే ఎక్కడ లేని శక్తి వస్తుందట. దీనిలో ఉండే పొటాషియం కండరాలను ఉత్తేజితం చేసి.. బలాన్ని చేకూరుస్తుంది. ఎనిమియా (రక్త హీనత)తో బాధపడే వారు.. తమ రోజూ వారి ఆహారంలో ఐరన్ ఎక్కవుగా ఉండే ఆహారాన్ని తీసకుంటారు. కానీ సీతాఫలంలో ఐరన్ మాత్రమే కాకుండా.. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.

కాబట్టి రక్తహీనతను దూరం చేస్తుంది. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.. సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. . సీతాఫలంలో సి విటమిన్‌, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికంగా ఉంటుంది ఈ పండుకు. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.