సీతాఫలంలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. కొన్ని రకాల వ్యాధులకు ఇది ఒక నివారిణి. ఇది మూడు నెలలకు పైగా లభిస్తుంది. సీజన్ వస్తోందంటే చాలు… కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం. దీనిలో ఎక్కువగా ప్రొటీన్లు, ఫ్యాట్లు లభ్యమవుతాయి.
వీటితో పాటు చాలా ఎక్కువ మోతాదులో విటమిన్ సి కూడా ఇందులో ఉంటుంది. ఏదైనా శరీరానికి గాయం అయినప్పుడు వాటిని మాన్పడంలోనే ఈ సీతాఫల పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ మెరుగపడటానికి.. మలబద్ధకంతో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుది. డయోరియాను కూడా తగ్గిస్తుంది. ఎముకలు గట్టిగా తయారు అవ్వడానికి కాల్షియం గుణాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా కీళ్లలోని యాసిడ్లను బయటకు తీసి.. కీళ్లనొప్పులు, రుమాటిజం వంటి వాటికి చెక్ పెట్టేస్తుంది.
నీరసంగా ఉన్నప్పుడు సీతాఫలం తింటే ఎక్కడ లేని శక్తి వస్తుందట. దీనిలో ఉండే పొటాషియం కండరాలను ఉత్తేజితం చేసి.. బలాన్ని చేకూరుస్తుంది. ఎనిమియా (రక్త హీనత)తో బాధపడే వారు.. తమ రోజూ వారి ఆహారంలో ఐరన్ ఎక్కవుగా ఉండే ఆహారాన్ని తీసకుంటారు. కానీ సీతాఫలంలో ఐరన్ మాత్రమే కాకుండా.. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి రక్తహీనతను దూరం చేస్తుంది. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.. సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. . సీతాఫలంలో సి విటమిన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికంగా ఉంటుంది ఈ పండుకు. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…