కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఇటు విద్యిర్థినీ విద్యార్థులు చాలామందికి స్నేహితులుగా మారుతారు. కొంతమందికి ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే జంటలు చాలా తక్కువగా ఉంటుంది. ధైర్యం చేసి ఇంట్లో చెప్పకపోవడం, టైం పాస్ గా లవ్ చేసి ఎవరి దారి వాళ్లు చూసుకోవడం.. ప్రేమ అంటే ఎంటో అర్థం తెలియకుండా.. ఎట్రాక్షన్ ను ప్రేమ అనే భ్రమలో ఉండటం లాంటి కారణాలతో పెళ్లి అనే కార్యం వరకు కొన్ని జంటలు వెళ్లవు.
అయితే మరికొన్ని జంటలు నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. కులాలు వేరు కావడంతో ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకునే జంటలో కూడా ఇరు కులాలు ఒక్కటే.. దీంతో ఆయువకుడు ఆమె ప్రేమ కోసం తహతహలాడుతూ ఓ రోజు ప్రపోజ్ చేశారు. ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుతున్నారు.
కానీ ఆమె అతడికి ఒక షాకింగ్ నిజం చెప్పింది. తాను నీకు చెల్లి వరుస అవుతానని. దీంతో ఆ యువకుడికి నోటి నుంచి మాట రాలేదు. కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ప్రేమను ఆ యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తర్వాత 5 రోజులకు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటు చేసుకుంది.
సంతులాల్‌పోడు తండా చెందిన వంశీ.. మహబూబాబాద్‌లో ఇంటర్ చదువుతూ ఉన్నాడు. కాలేజీలో గంధంపల్లి–కొత్తపేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ప్రేమిస్తున్నానని చెప్పడంతో చెల్లి వరుస అవుతాను అంటూ ఆమె చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…