నన్ను ఇమిటేట్ చేసే వాళ్లతో.. నేను అలానే రియాక్ట్ అవుతా: ఓంకార్

యాంకర్ ఓంకార్.. పరిచయం అక్కర్లేని పేరు. అతడు ఎన్నో ప్రోగ్రాంలకు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నాడు. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఎన్నో షోలకు అతడు హోస్ట్ గా వ్యవహరించాడు. అతడు తన కెరీర్ మొదట్లో ఎంతో ఇబ్బందులకు ఎదుర్కొన్నాడు.

ట్రెండ్ ను ఫాలో కావడం కంటే.. సెట్ చేయడమే తనకు ఇష్టమని చెబుతాడు ఓంకార్.. అతడి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.. తాను సినీ ఇండస్ట్రీకి యాంకర్ అవ్వాలని రాలేదు.. డైరెక్టర్ అవుదామని వచ్చా.. కానీ యాంకర్ ను అయ్యా అంటూ చెప్పాడు. కానీ నేను అనుకున్న దాని కంటే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక తనది కాకినాడ అని.. తన తండ్రి డాక్టర్ అని చెప్పుకొచ్చాడు.

తక్కువ ఫీజుతో వైద్యం అందించేవాడని చెప్పాడు. తనేమీ సంపాదించుకోలేదు. కానీ మంచి డాక్టర్‌గా, మంచి మనిషిగా మాత్రం మిగిలిపోయారన్నాడు. జీ తెలుగులో అవకాశం వచ్చిన తర్వాత యాంకర్‌గా ‘మాయాబజార్‌’ చేశానన్నారు. తర్వాత సొంతంగా ఏదైనా చేయలనే ఆలోచన వచ్చిందని.. క్రియేటర్‌, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, యాంకర్‌గా నేను చేసిన తొలి కార్యక్రమం ‘మాయాద్వీపం’ అంటూ చెప్పాడు. దీని తర్వాత తాను వెనక్కి తిరిగి చూసుకోలేదన్నాడు.

ఇక మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా.. మీరెప్పుడైనా ఫీల్ అయ్యారన్న అన్న ప్రశ్నకు అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. లేదు..తాను ఇంకా అదృష్టంగా భావిస్తా. సాధారణంగా హీరోలను, రాజకీయ నాయకులను మాత్రమే ఇమిటేట్‌ చేస్తారు. నన్నుకూడా ఇమిటేట్ చేస్తున్నారంటే అది నా గొప్పే కదా అన్నాడు. దానిని నేను సరదాగా తీసుకుంటాను తప్ప కోపం తెచ్చుకొని ఈ సందర్భంగా ఓంకార్ తెలియజేశారు.