గంగవ్వ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బిగ్ బాస్ 4 సీజన్లో అడుగు పెట్టిన తర్వాత ఆమెకు ఉన్న పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. మొదట మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా పరిచయం అయిన గంగవ్వ.. తన భాష, యాసతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకుంది.
ఈ షో ద్వారా ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆమె గొంతులో ఏదో ఆకర్షణ.. ఆమె మాట్లాడుతుంటే మన అవ్వ మాట్లాడిన అనుభూతి. అందుకే ఆమె అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగారు. బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే.. మన ఇంట్లో పెద్దలు మాట్లాడినట్లే ఉంటుంది.
అందుకనే గంగవ్వకు చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఆమె ఏ వీడియోలు పోస్టు చేసినా.. చూసేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ లోకి అడుపెట్టిన తర్వాత నాగార్జున తనకు ఇల్లు కట్టిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు తీసుకొని యూట్యూబ్ లో పోస్టు చేశారు గంగవ్వ.
అయితే ఈ సందర్భంగా కొందరు బిజీగా ఉండటంతో రాలేకపోయారని.. వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇంటి నిర్మాణానికి సహకారం అందించిన బిగ్ బాస్ నిర్వాహకులకు, నాగార్జునకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అఖిల్, శివజ్యోతి వచ్చారని.. చాలా సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…