Yandamuri Veerendhranath : చిరంజీవికి అమితాబ్ బచ్చన్ అంత స్థాయి లేదు… చిరంజీవి భార్యను ఏకవచనంతో సంభోదిస్తే లెంపలేసుకోవాలా…: యండమూరి వీరేంద్రనాథ్

Yandamuri Veerendhranath : తెలుగులో నవలా రచయితగా ఎన్నో ఫేమస్ నవలలను రాసిన వ్యక్తి యండమూరి గారు. వెన్నెల్లో ఆడపిల్ల, రాక్షసుడు, మరణ మృదంగం, తులసీ దళం వంటి ఎన్నో నవలలను రాసిన ఆయన అప్పట్లో పాఠకులను ఆయన కలంతో ప్రభావితం చేశారు. ఆయన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చి హిట్ అందుకున్నాయి. ఇక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో ఉపన్యాసాలను ఆయన పలు విద్యా సంస్థల్లో ఇస్తూ ఎంతో మందిని ప్రభావతం చేశారు. ఇక సినిమాల్లో కథను అందించేవరకే నా పాత్ర ఇక సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే యండమూరి గారు పలు అంశాల మీద తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

చిరంజీవి కన్నా అమితాబ్ గొప్ప నటుడు…

నటుడు వేరు, స్టార్ వేరు అంటూ యండమూరి గారు రెండింటికీ మధ్య బేధన్ని వివరించారు. వయసుమల్లిన పాత్రలో కూడా నటించి మెప్పించేవాడు నటుడు. అలాంటి నటులు అమితాబ్, నజీరుద్దిన్ షా, తెలుగులో ఎస్వి రంగారావు లాంటివాళ్లు నటులు. మా వాడు చిరంజీవి కూడా కొంతవరకు నటుడే. పూర్తి స్థాయిలో కాదు, కామెడీ డాన్స్ అన్నీ చేయగలడు అయితే అమితాబ్ లాగా ఇద్దరు పిల్లలు తండ్రిలాగ ఒక డీ గ్లామరస్ పాత్రలో నటిస్తే పరిపూర్ణ నటుడు అవుతాడు.

తెలుగులో స్టార్స్ కావాలి నటులు కాదు. మన ప్రేక్షకుల అభిరుచి వేరు, మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ వంటి వారు నటులుగా ఎలాంటి పాత్రలైనా చేస్తారు కానీ మనవాళ్లు ఇమేజ్ చట్రంలో ఉంటారు అంటూ చెప్పారు. ఇక ఒక స్కూల్ లో పిల్లలతో మాట్లాడే సమయంలో చిరంజీవి అలాగే భార్యను ఏకవచనంతో సంభోదించడం పట్ల అభ్యంతరం వ్యక్తం అయింది. అది ఇంటర్వ్యూ కాదు, స్పీచ్ ఇమ్మన్నపుడు ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడిన సమయంలో అన్నదే, ఉద్దేశపూర్వకంగా కాదు. దానికోసం ఇప్పుడు నేను లెంపకాయలు వేసుకోవాలా అంటూ అయినా చిరంజీవి నాకు మిత్రుడు, నాకు ఆ చనువు ఉందనే భావనతో మాట్లాడాను అంటూ చెప్పారు.