Featured

Heroine Laya : ముకేష్ అంబానీ నా బ్రదర్… నా ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే… చిరంజీవి సహాయం ఎందుకు??: హీరోయిన్ లయ

Heroine Laya : తెలుగుమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనే ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అనే టాక్ ఉన్నా ఈ తెలుగు అమ్మాయి మాత్రం హీరోయిన్ గా మంచి సక్సెస్ చూసి కెరీర్ లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ అమ్మాయి మరెవరో కాదు ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా తొలి అవకాశంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న లయ. స్వయంవరం, ప్రేమించు అంటూ వరుస హిట్లందుకుంది. అలాగే నంది పురస్కారాలను కూడా అందుకుంది. తన నటనతో ఆందరినీ ఆకట్టుకున్న లయ కెరీర్ బాగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ తరువాత కుటుంబ బాధ్యలకు దగ్గరైన లయ సినిమాలకు దూరమైయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్న లయ ఒకవైపు సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లో ఉంటూనే మరోవైపు సినిమాలను చేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన ఫ్యామిలీ గురించి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే… టాటా మానవరాలిని…

లయ రీసెంట్ గా పలు యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత అలానే కెరీర్ కి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. అలా తన ఆస్తుల గురించిన ప్రశ్న ఎదురైనపుడు తాను ముకేష్ అంబానీ చెల్లిని అంటూ సరదాగా చెప్పారు. నాకు సొంత విమానం ఉందని, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏవేవో అనుకుంటారు కానీ అలాంటిదేమీ లేదు. నా భర్త డాక్టర్ కావడం వల్ల తనకు మూడు హాస్పిటల్స్ ఉండటం, అలా కొంత బాగానే ఉన్నా. కానీ మరీ ఓన్ ఫ్లైట్, టాటా మానవరాలిని అనేంత రేంజ్ కాదు అంటూ చెప్పారు.

ఇక సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్ గురించి మాట్లాడుతూ చిరంజీవి గారు నేను ఆర్థిక కష్టాల్లో ఉంటే సాయం చేసారనే వార్తలు రాసారు. కానీ నాకెప్పుడూ అలాంటి అవసరం రాలేదు. మా నాన్న వైద్యులు, ఆర్థికంగా బాగానే ఉన్నాను, ఓకే కూతురుని నచ్చింది చేయమన్నారు. అలా సినిమాల్లోకి వచ్చాను. ఏ రోజూ రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆలోచించలేదు. ఎంతో మంది నాకు రెమ్యూనరేషన్ ఎగొట్టారు కానీ వదిలేసాను అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago