Yandamuri Veerendranath: నాగబాబుని గారు అని పిలవాలా..? రామ్ చరణ్ ను, చిరంజీవి భార్యని అలా అన్నందుకు లెంపలు వేసుకోవాలా?

Yandamuri veerendranath: ప్రముఖ నవల రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఇకపోతే యండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవికి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అన్న సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు యండమూరి కథ అందించడం ఆయన సినిమాలకు పలు సలహాలు సూచనలు చేసినట్లు పలు ఇంటర్వ్యూలలో సందర్భంగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా యండమూరి యువతలో ప్రోత్సాహాన్ని నింపుతూ ఎన్నో మోటివేషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.అయితే గతంలో యండమూరి వీరేంద్రనాథ్ రామ్ చరణ్ ముఖకవళికలు గురించి కామెంట్ చేయడంతో చిరంజీవి బాధపడ్డారని దాంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చాయి.కానీ మనస్పర్థలు రాలేదని రామ్ చరణ్ కామెంట్ చేసినందుకు చిరంజీవి బాధపడ్డారని తెలిసిందంటూ యండమూరి ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఏక వచనంతో సంబోధించడం…


ఇకపోతే నాగబాబు గారి విషయంలో కూడా కామెంట్ చేసినందుకు యండమూరి పట్ల మనస్పర్థలు వచ్చాయి. అలాగే ఒక సభాముఖంగా చిరంజీవి భార్య సురేఖ గారిని సురేఖ అని ఏక వచనంతో సంబోధించడం వల్ల మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం గురించి బాధపడినట్లు ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు యండమూరి సమాధానం చెబుతూ.. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి రావడం సర్వసాధారణం అయితే వాటిని రికార్డ్ చేసే టెలికాస్ట్ చేసే వాళ్ళు వేరే విధంగా ఫోకస్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి.అయితే రామ్ చరణ్ ను, చిరంజీవి భార్యను అలా అన్నందుకు నేను లెంపలు వేసుకోవాలా…అని యండమూరి ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయం గురించి ప్రస్తావించారు