Allari Naresh: సర్పయాగం సినిమా తో హీరోయిన్ గా అడుగుపెట్టిన రోజా ఆ తరువాత ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సీతా రత్నం గారి అబ్బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వీ వీ సత్యనారాయణ గారూ అల్లరి నరేష్ వాళ్ళ నాన్నగారే. ఇక రోజా ఆ తరువాత ఒక దశాబ్దం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అది కూడా కేవలం తెలుగులోనే కాదు కన్నడ, తమిళం, మలయాళం లో టాప్ హీరోస్ తో జత కట్టింది.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మా టీవీ లో మోడరన్ మహాలక్ష్మి షో తో వచ్చిన రోజా ఆ తరువాత ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం తో ఫేట్ మారిపోయింది. ఒకరకంగా జబర్దస్త్ రోజాను మళ్ళీ జనాలకు దగ్గర చేసింది. ఇక అల్లరి నరేష్ కి రోజాకు మధ్య గమ్మతైన రిలేషన్ ఉంది. జబర్దస్త్ షో ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరైన రోజా అంటే అటు ప్రేక్షకులకే కాదు సెలబ్రిటీలలో కూడా చాలా మందికి ఇష్టం అలా డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చాలాసార్లు రోజా పై ఉన్న ఇష్టాన్ని చెప్పారు. ఇక ఈ జాబితాలో మన అల్లరోడు కూడా ఉన్నాడట.
అపుడు నేను ఎత్తుకున్న…ఇపుడు నరేష్ ఎత్తుకున్నాడు…!
ఈ మధ్య తక్కువ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ లాస్ట్ ఇయర్ నాంది సినిమాతో వచ్చి తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ సమయంలో జబర్దస్త్ కు సినిమా ప్రచారం కోసం డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కలిసి వచ్చిన అల్లరి నరేష్ జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న రోజాతో డాన్స్ చేసి ఏకంగా ఆమెను ఎత్తుకున్నారు. ఆ సమయంలోనే రోజా గారితో నటించాను కానీ హీరోగా సినిమా చేయలేదంటూ చెప్పారు. ఇక రోజా కూడా నరేష్ గురించి మాట్లాడుతూ సీతా రత్నం గారి అబ్బాయ్ సినిమా షూటింగ్ సమయంలో నరేష్ చిన్న పిల్లోడు ఎత్తుకుని ఆడించేదాన్ని ఇపుడు నన్ను ఎత్తుకుని తిప్పుతున్నాడు అంటూ సరదాగా మాట్లాడారు. అప్పట్లో ఆ మాటలు బాగా వైరల్ అయ్యాయి.
రోజా, నరేష్ తండ్రి ఈ వీ వీ గారి సీతా రత్నం గారి అబ్బాయ్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఈ వీ వీ సినిమా హలో బ్రదర్స్ లో ఒక ప్రత్యేక పాటలో నర్తించింది. ఇక కృష్ణ అల్లూరి సీతా రామ రాజు సినిమా సీక్వేల్ సినిమా తెలుగు వీర లేవరా సినిమాలో హీరోయిన్ గా నటించారు రోజా. ఇక ఈ సినిమాకు ఈ వీ వీ సత్యనారాయణే దర్శకుడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…