Featured

Nandini Reddy: మహిళ అనే చిన్న చూపుతో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసభ్యంగా మాట్లాడాడు… మహిళా దర్శకురాలు నందిని రెడ్డి…

Nandini Reddy: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాంపాదించారు నందిని రెడ్డి. 11 ఏళ్ళ క్రితం తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నందిని రెడ్డి, తన మొదటి సినిమా అయిన అలా.. మొదలైంది తోనే విజయాన్ని సాధించిన హిట్ సినిమా దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని సినిమాల తరువాత వచ్చిన సమంత తో తీసిన ఓ బేబీ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మహిళా దర్శకురాలిగా మంచి పేరు సంపాదించుకున్న నందిని రెడ్డి కి కూడా ఇండస్ట్రీ లో చేదు అనుభవం ఎదురైనట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

నన్ను అది, ఇది అంటూ మాట్లాడారు….

మహిళలంటే చాలా చోట్ల చిన్న చూపు చూపిస్తారు. ఆ విషయంలో నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కల్యాణ వైభోగమే చిత్రం షూటింగ్ సమయంలో తాను మహిళ అనే చిన్నచూపుతో ఒక సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తనగురించి అసభ్యంగా మాట్లాడాడు అని తెలియజేసారు. ఒక సాంగ్ షూటింగ్ కి అవసరం అయిన కెమెరా లెన్స్ ని ఆయన రద్దు చేశారు. దీనితో అతడికి చెప్పకుండా నేను నిర్మాతని అడిగి వాటిని తెప్పించుకున్నా, కానీ అవి ప్రమాదవశాత్తు విరిగిపోయాయి. నాకు చెప్పకుండా చేస్తోంది అన్న ఫీలింగ్ తో నా అసిస్టెంట్ తో అతడు అసభ్యంగా మాట్లాడాడట.

ఏమనుకుంటోంది అది.. ఇది అని ఏకవచనంతో సంభోదిస్తూ నన్ను తిట్టాడట. ఆ విషయం నా దృష్టికి రాగ వెంటనే నిర్మాతని కలిసి అతడు సెట్స్ లో ఉంటే నేను సినిమా చేయలేను .. వెళ్ళిపోతాను అని నిర్మాతతో చెప్పేసాను. ఆయన సీనియర్.. అని నిర్మాత చెప్పినా నేను వినలేదు చేయను అని చెప్పేసాను.

దీనితో అతడిని మా సినిమా నుంచి తప్పించారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీసెట్స్ లో కనిపించాడు. నేనె వెళ్ళిపోతున్నట్లు నిర్మాతకు సమాచారం ఇవ్వండి అని అక్కడున్నవాళ్లకు చెప్పి, ఆ నా * సెట్స్ లో ఉంటే నేను రాను అని నిర్మాతకు కూడా చెప్పాను. నా నుంచి బూతు మాట రావడం అదే తొలిసారి. ఆయన సినిమా షూటింగ్ కోసం రాలేదు, ఏదో క్యాంపెనింగ్ కోసం వచ్చారు అని చెప్పగా దీనితో నేను తిరిగి షూటింగ్ లో పాల్గొనినట్లు నందిని రెడ్డి చెప్పారు. ఆ సంఘటన మినహా ఇండస్ట్రీలో తనకు ఎలాంటి చేదు అనుభవం జరగ లేదని నందిని రెడ్డి తెలియజేసారు. ప్రస్తుతం నందినీరెడ్డి నాగచైతన్య తో ఒక సినిమా చేయబోతున్నారు. స్వప్న దత్ ఈ సినిమాని స్వప్న సినిమా పతాకంపై కాకుండా వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago