YS Vivekananda Reddy: వివేకానంద షమీమ్ లవ్ స్టోరీ… ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు…!

YS Vivekananda Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ ను తలపిస్తూ కొత్త క్యారెక్టర్స్ పుడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త వ్యక్తి పేరు ఈ కేసులో వినిపిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర విచారణ ఆగిపోయింది. అయితే ఇల్లీగల్ అఫైర్స్ వివేకానంద చావుకు కారణమని పలు మార్లు వినిపించినా వివేకానంద రెండో భార్య గురించి కూడా పలు కథనాలు వచ్చినా ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న ఆయన రెండో భార్య మొదటి సారి నోరు విప్పారు. ఆమె సిబిఐ ముంగిట పెట్టిన విషయాలలో ఇంట్రస్టింగ్ అంశాలు ఉన్నాయి. వివేకానందతో పరిచయం, పెళ్లి దగ్గరి నుండి తాను హత్యకు గురయ్యే గంట ముందు కూడా మాట్లాడినట్లు షమీమ్ చెబుతోంది. ప్రస్తుతం ఈమె స్టేట్మెంట్ విచారణలో కీలకం కానుంది.

భార్య అనారోగ్యం గురించి చెప్పేవాడు…

ఎంఎస్సీ బయో చదివిన షేక్ షమీమ్ 2008లో ఉద్యోగం కోసం తన అక్క భర్త ద్వారా వివేకానంద రెడ్డి గారితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్ కి వెళ్ళినపుడు వివేకానంద గారు స్వయంగా వచ్చి ఆయన రిఫరెన్స్ ద్వారా ఉద్యోగం వచ్చిందని చెప్పారు షమీమ్. అయితే మా అక్క కంటే ముందే నాకు జాబ్ వచ్చిందని అక్క బాధపడటం వల్ల నేను జాబ్ జాయిన్ కాలేదు అంటూ స్టేట్మెంట్ లో చెప్పారు. ఇక అలా ఏర్పడిన పరిచయంతో వివేకానంద గారితో మాట్లాడేదాన్ని అలా కొంత కాలం తరువాత ఆయన నాకు ప్రపోజ్ చేసారంటూ షమీమ్ తెలిపారు. వివేకానంద అయితే తన భార్య గురించి చెప్పి ఆమె మీద ఉన్న ప్రేమ తెలిసాకే నాకు ఆయన మీద మరింత గౌరవం పెరిగిందని తెలిపారు షమీమ్. అలా రెండు ఏళ్ల సమయం తీసుకున్న తరువాత 2010లో తాను అంగీకరించినట్లు షమీమ్ తెలిపారు. తన భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఎపుడూ చెప్పేవాడని తన భార్య అంటే చాలా ప్రేమ ఉందని తెలిపారు.

అలా 2010లో వివాహం చేసుకున్న తమకు 2011లో మరోసారి వివాహం అయిందని 2015లో షహన్షా జన్మించాడని తెలిపారు షమీమ్. తమ బంధం వైఎస్ కుటుంబంలో ఎవరూ అంగీకరించలేదని, సునీత పలు మార్లు ఫోన్ చేసి దూరంగా ఉండమని బెదిరించిందని ఇక వివేకా బావమరిది, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన అన్న శివప్రకాష్ రెడ్డి పలుమార్లు తన కుటుంబ సభ్యులను బెదిరించారంటూ తెలిపారు. ఇక శివప్రకాష్ రెడ్డి కి వివేకా పదవి మీద, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఆస్తి మీద కన్ను ఉందని తెలిపారు. ఇక బెంగళూరులో 8 కోట్ల సెటిల్మెంట్ గురించి చెప్పాడని, హత్య జరిగిన రోజు కూడా ఫోన్లో చెప్పాడని షమీమ్ తెలిపారు. హత్య అనంతరం ఇంటికి వెళ్లాలనుకున్నా శివ ప్రకాష్ రెడ్డికి భయపడి వెళ్ళలేదని తెలిపారు.