Custody: అక్కినేని నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చైతన్య ఈ సినిమా టైటిల్ గురించి పలు విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా కస్టడీ సినిమా గురించి మాట్లాడుతూ చిత్ర బృందం ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఇది కాదని తెలిపారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు శివ అందుకే ఈ సినిమాకి కూడా శివ అనే టైటిల్ పెట్టాలని డైరెక్టర్ అనుకున్నారు కానీ ఈ టైటిల్ కనక పెడితే ప్రతి ఒక్కరు నాన్న నటించిన శివ సినిమాకు ఈ సినిమాకు పెద్ద ఎత్తున పోలికలు పెడుతూ ఉంటారు అందుకే వద్దని చెప్పాను.
ఇలా పాత సినిమాతో ఈ సినిమాకు పోలికలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే శివ టైటిల్ వద్దని చెప్పానని అయితే కస్టడీ అని ఎందుకు పెట్టాము అనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని ఈ సందర్భంగా నాగచైతన్య కస్టడీ సినిమా టైటిల్ గురించి చేసినటువంటి ఒక కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా గురించి డైరెక్టర్ వ్యవహరించిన తీరు గురించి కూడా ఈయన తెలిపారు.
ఈ సినిమా కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ వెంకట్ గారు తనకు ఎలా అయితే కథ చెప్పారో సినిమా చేసేటప్పుడు కూడా అలాగే షూట్ చేశారని తెలిపారు.కథ ఒకటి చెప్పి సినిమా ఒకటి చేయలేదని ఎక్కడ కూడా ఎలాంటి మార్పులు చేయలేదని ఈ సందర్భంగా నాగచైతన్య కస్టడీ సినిమా గురించి చెబుతూ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయని తెలియజేశారు. మరి నాగచైతన్య పెట్టుకున్న అంచనాలకు ఈ సినిమా చేరుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…