Categories: FeaturedMovie News

Pokuri Baburao : ఆ కాలేజీలో టి.కృష్ణకు చిరంజీవి జూనియర్…కలిసి ఓ సినిమా చేద్దాం అనుకునే లోపే చిరంజీవి మాకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. : పోకూరి బాబురావు.

Pokuri Baburao : ఒంగోలు లోని సి.ఎస్.ఆర్ శర్మ కాలేజీలో పోకూరి బాబురావు డిగ్రీ బీ.కాం చేసాడు. అక్కడ అతని క్లాస్ మేట్ టి.కృష్ణ. అతను ఎక్కువగా పాటలు బాగా పాడటం మూలాన కృష్ణకు అతనంటే అభిమానం ఏర్పడింది. కాలేజీ వార్షికోత్సవంలో, వీడ్కోలు సభలలో నాటకాలు వేసేవారు. ఈ నాటకాలకు కృష్ణ దర్శకత్వం వహించేవాడు. బాబూరావు “సంభవామి యుగే యుగే” నాటకంలో చిన్న పాత్ర వేసాడు.

మాదాల రంగారావు ప్రారంభించిన యువతరం కదిలింది సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో అతను కృష్ణతో పాటు పాల్గొన్నాడు. వాళ్ళిద్దరూ చిన్న వేషాలు వేసేవారు. పోకూరి బాబురావు బ్యాంకు ఉద్యోగానికి సెలవులు పెట్టి ఇవన్నీ చేసేవాడు. డబ్బింగ్, ఎడిటింగ్ కోసం మద్రాసు వెళ్ళి ఆయా దశలను పరిశీలించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే పోకూరి బాబురావు ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టి కృష్ణ సహాయ దర్శకునిగా పని చేస్తూ.. దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో బాపు దర్శకత్వంలో 1978లో విడుదలైన మన ఊరి పాండవులు చిత్రం మద్రాసులో ఒక థియేటర్లో ఆడుతుంటే నేను, టి కృష్ణ కలిసి ఆ సినిమాకి వెళ్ళాం.

అక్కడ నేను టి కృష్ణతో సినిమా చూస్తున్నప్పుడు.. ఎర్రటి కళ్ళు, చాకు లాంటి నడక, చురుకుగా కనిపించే ఓ కుర్రాడు తరచూ ఆ సినిమాలో సైకిల్ పై వెళుతూ మధ్యలో సైకిల్ స్టాండ్ వేస్తూ సంభాషణలు చెబుతూ ఉంటాడు. ఆయనను టి కృష్ణ గుర్తుపట్టారు. ఇతన్ని ఎక్కడో చూశాను. ఒంగోలులో మనం సి ఎస్ ఆర్ శర్మ కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ అబ్బాయి లాగానే ఒకతను సైకిల్ పై వస్తూ సైకిల్ స్టాండ్ లో సైకిల్ పెట్టి క్లాసులోకి వచ్చేవాడని నీకు గుర్తుందా అంటూ నన్ను టీ కృష్ణ అడిగారు. కానీ నాకు ఎంతకు అతనెవరో గుర్తుకు రాలేదు. ఆ తర్వాత ఓ సినీ పత్రికలో చిరంజీవి ఇంటర్వ్యూ వచ్చింది.

అప్పుడు ఆయన సి ఎస్ ఆర్ శర్మ కాలేజీలో చదువుకున్నానని చెప్పారు. అప్పుడు దర్శకుడు టీ కృష్ణ చెప్పింది నిజమే అనుకున్నాను. అయితే విషయం ఏమంటే.. ఆ తర్వాత టి కృష్ణ ఒక కథ అనుకున్నారు. అది నాకు వినిపించి, ఆ కథకు స్త్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాయడం మొదలుపెట్టారు. అయితే ఆ కథకి ఎవరు హీరో అయితే బాగుంటుందన్న క్రమంలో చిరంజీవి మా ఆలోచనకు తట్టారు. కథ సంభాషణలు రాసుకునే సరికి చాలా సమయం పట్టింది. ఆలోపే చిరంజీవి ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక మేము అతనితో సినిమా రూపొందించాలనుకునే లోపే ఆయన అందనంత ఎత్తుకు ఎదిగారు.ఆ క్రమంలో ఆ కథను కాదనుకొని మళ్లీ లేడీ ఓరియంటెడ్ కథతో విజయశాంతి ప్రధాన పాత్రలో నేటి భారతం చిత్రాన్ని రూపొందించమని ఆ ఇంటర్వ్యూలో పోకూరి బాబురావు చెప్పారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago