సినిమా రంగంలో ఒక్కసారి క్లిక్ అయితే చాలు.. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వాటంతట అవే వచ్చి వాలుతాయి. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేదు.. ఎక్కడైనా ఒక్కటే.. హీరోగా మంచి క్రేజ్ సంపాదిస్తే చాలు.. ఆ క్రేజ్ ను వాడుకునేందుకు ముందుకు వస్తాయి పలు మల్టీ నేషనల్ కంపెనీలు. వారిని తమ బ్రాండ్ల ప్రచార కర్తలుగా మార్చుకుని అవి లాభం పొందుతూ హీరోలకు భారీగా డబ్బులు ముట్టజెప్తున్నాయి.
తెలుగు హీరోలు సైతం ఈ పద్దతిలోడబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ లో చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. సినిమాలలో నటించినందుకు కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు.. వాణిజ్య ప్రకటనలకు సైతం భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంతకీ తెలుగు సినిమా నటులు యాడ్స్ లో నటించినందుకు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒకే యాడ్ లో నటించాడు. అదీ మహేంద్ర కంపెనీకి చెందిన టియువి 300కార్ కి సంబంధించిన యాడ్. ఇందుకు గాను తను రెండు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు.
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్ లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు తను దాదాపు 10 యాడ్స్ చేస్తున్నాడు. ఒక్కో యాడ్ క రెండు కోట్ల రూపాయల చొప్పున తీసుకుంటున్నాడట. ఈ సొమ్మును చిన్న పిల్లల గుండె సంబంధ వ్యాధుల నిర్మూలన కోసం వాడుతున్నాడట.
జూ. ఎన్టీఆర్
నవరత్న హెయిర్ ఆయిల్, మలబార్ గోల్డ్, జండూ బామ్ సహా పలు యాడ్స్ చేశాడు. ఒక్కొక్క యాడ్ కి కోటి రూపాయల వరకు డబ్బులు తీసుకన్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్
రామరాజు కాటన్, మణప్పుర గోల్డ్ లోన్ వంటి యాడ్స్ లో వెంకటేష్ నటించాడు. ఒక్కొక్క యాడ్ కి కోటి రూపాయల వరకూ చార్జ్ చేశాడట.
నాగార్జున
కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ లో కనిపించే కింగ్ నాగార్జున కోటిన్నర వరకూ తీసుకున్నాడట. దీనితో పాటు గడీ డిటడ్జెంట్ సహా పలు యాడ్స్ లో ఆయన నటించాడు.
అల్లు అర్జున్
రెడ్ బస్, క్లోజ్ అప్, OLX యాడ్స్ లో నటటించాడు అల్లు అర్జున్. తాజాగా ప్రూటీ యాడ్ లో అలియా భట్ తో కలిసి నటించేందుకు కోటిన్నర తీసుకుంటున్నాడట.
నాగచైతన్య
చెన్నై షాపింగ్ మాల్, రెక్సోనా, క్లోజప్ యాడ్స్ లో చేశాడు నాగ చైతన్య. ఒక్కో యాడ్ కి 70 లక్షల వరకూ తీసుకుంటున్నాడట.
రానా
రిలయన్స్ ట్రెండ్స్, జంగ్లీ రమ్మీ, ఓ మద్యం యాడ్ చేశాడు రానా. ఒక్కో యాడ్ కి కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…