Actor Siva Krishna : పెద్ధ హీరోలు మాట్లాడినంత మాత్రాన ఏపీకి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వదు…: నటుడు శివ కృష్ణ

Actor Siva Krishna : సినిమా ఇండస్ట్రీ మొదట్లో చెన్నై కేంద్రంగా ఉండేది. ఆరోజుల్లో మొత్తంగా సౌత్ కి మద్రాస్ లోనే సినిమా షూటింగ్స్ అన్ని జరిగేవి. ఆ తరువాత తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి చొరవ అలాగే అగ్రహీరోలైన నాగేశ్వరావు గారు రామారావు గారి చొరవతో ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో స్టూడియోస్ అలాగే డబ్బింగ్ థియేటర్స్ ఇలా అన్ని ఒక్కొక్కటిగా వచ్చేసాయి. సినిమా తీయాలంటే హైదరాబాద్ నగరంలో అన్ని వసతులు ఉన్నాయి అనేలా తయారైంది. అయితే కాలక్రమంలో రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉన్నాయి. దీంతో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కు తరలి రావాలి అంటూ ఇక్కడి ప్రభుత్వం కోరుకుంటోంది. ఇండస్ట్రీ వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయాని అందువల్ల ఇక్కడ స్టూడయో లు నిర్మించి షూటింగులు చేయాలని సూచించారు. అయితే ఇవేవి జరిగే పనులు కాదంటూ సీనియర్ నటుడు శివ కృష్ణ అభిప్రాయపడుతున్నారు.

ఇండస్ట్రీ ఏపీకి రావడం అసాధ్యం…

నటుడు శివ కృష్ణ గారు మాట్లాడుతూ పెద్ధ హీరోలందరూ మా సినిమాలకు తొడ్పాటు ఇవ్వండి అంటూ ఏపీ సీఎం జగన్ తో భేటీ అవ్వడం అన్నీ మీడియా ముందు బాగానే ఉంటాయి. అలాగే సీఎం కూడా ఇక్కడ స్టూడియోలు కట్టండి ప్రభుత్వం సహాయం చేస్తుంది అని చెప్పడం కూడా పైకి చెప్పే మాటలే కానీ అవన్నీ జరిగే పనులు కాదు అంటూ చెప్పారు.

స్టూడియోలు కట్టాలంటే ఇండస్ట్రీలో ఏ ఒక్కరి వల్లో కాదు కదా ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి, స్థలం చూపించాలి. అలాంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేనపుడు ఆల్రడీ కంఫర్టబల్ గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎందుకు ఏపీలో స్టూడియోలు కడతారు అంటూ చెప్పారు శివ కృష్ణ.