Featured

Sowcar Janaki : నువ్వు సినిమాలకు పనికి రావు వెళ్ళిపోమన్నారు ఆయన…: సీనియర్ నటి షావుకారు జానకి

Sowcar Janaki : ‘షావుకారు’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా మొదటి సారి నటించిన జానకి గారు ఆ సినిమా తరువాత షావుకారు జానకి గా గుర్తింపు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల వయసులో పెళ్లయ్యాక సినిమాల్లోకి వచ్చిన ఆమె అనతికాలంలోనే మంచి గుర్తింపు అందుకున్నారు. మొదలు పెట్టడమే హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె తమిళ, తెలుగు, కన్నడ ఇలా పలు భాషలలో నటించి పలు అవార్డులు అందుకున్నారు. 73 ఏళ్ల సుధీర్ఘ కెరీర్ లో హీరోయిన్ గాను అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా సినిమాల్లో నటించారు షావుకారు జానకి గారు, తన కెరీర్ లో ఎన్నో విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సినిమాల్లోకి నువ్వు పనికిరావని అన్నారు…

షావుకారు జానకి గారు సినిమాల్లో నటించడానికి చెన్నై లో ప్రయత్నాలు మొదలు పెట్టిన కొత్తలో మొదటి రెండు నెలలు అసలు అవకాశాలు రాకపోవడంతో ఇక అవకాశాలు రావు అని నిరాశ పడ్డారట. అయితే అదే సమయంలో షావుకారు సినిమా అవకాశం అందునా హీరోయిన్ పాత్ర రావడంతో ఆనందంగా అనిపించిందని, బాలింతగా ఉంటూనే సినిమాలో నటించినట్లు తెలిపారు. ఇక ఆ సినిమా తరువాత ఒక రోజు కేవి రెడ్డి గారు చూసి నువ్వు రాజమండ్రి దగ్గరి పల్లెటూరి అమ్మాయి పాత్రలకైతే సరిపోతావు హీరోల పక్కన హీరోయిన్ గా నువ్వు బాగుండవు, ఒడ్డు పొడుగు బాగా ఉన్న హీరోయిన్లు చాలా మంది మా హీరోల పక్కన ఉన్నారు నువ్వు సినిమాలను మానేసి వెళ్ళిపో అని చెప్పారట.

అలా అన్న కొద్ది రోజులకు ‘వెంకటేశ్వరమహత్యం’ సినిమాలో సోది చెప్పే మహిళ పాత్ర చేసినపుడు షూటింగ్ దగ్గరికి అందరూ వచ్చి చూసేవారు. ఆ సమయంలో కేవి రెడ్డి గారు చూసి చాలా బాగా నటించావ్. నువ్వు మంచి ఆర్టిస్ట్ వి నేను ఆరోజు నిన్ను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారట. అపుడు షావుకారు జానకి గారు అయితే నేను ఇండస్ట్రీలో ఉండవచ్చా అండి వెళ్ళనక్కర్లేదు కదా అని అడిగారట. లేదు లేదు నువ్వు మంచి పాత్రలు ఇంకా చేయాలి అని చెప్పారట కెవి రెడ్డి గారు. అప్పటికే పలు తమిళ, కన్నడ సినిమాలలో హీరోయిన్ గా చేస్తూ బిజీ గా ఉన్నారు షావుకారు జానకి గారు.

Bhargavi

Recent Posts

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే సులభ మార్గాలు ఇవే! ఉసిరికాయతో పూజ… శుభఫలితాలు వస్తాయా?

శుక్రవారం అమావాస్య రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం…

47 minutes ago

దిండు జీవితకాలం ఎంత? పాత దిండు వాడుతున్నారా? షాకింగ్ విషయాలు ఇవే!

మన రోజువారీ జీవితంలో నిద్రకు ఉపయోగించే దిండు (Pillow) గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మంచిగా కనిపిస్తే, మృదువుగా…

1 hour ago

ముంబైకి హీరోగా మారిన డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్‌లో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. వేలంలో పెద్దగా డిమాండ్ లేకపోయిన ఒక ఆటగాడు, ఇప్పుడు మైదానంలో తన…

1 hour ago

ముంబై ఇండియన్స్‌కు ఏమైంది? ఫ్యాన్స్ ఆగ్రహం ఉప్పొంగింది!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వరుస పరాజయాలు జట్టుపై ఒత్తిడిని…

2 hours ago

డెలివరీ తర్వాత జుట్టు ఎక్కువగా రాలుతుందా? కొత్త తల్లులకు హెచ్చరిక… జుట్టు రాలడాన్ని ఇలా తగ్గించండి!

ప్రసవం తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోనల్ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల ప్రభావం చర్మం, శక్తి స్థాయి మాత్రమే…

2 hours ago

తులసి మొక్క దగ్గర ఈ చెట్లు ఉంటే సమస్యలేనా? వాస్తు షాకింగ్ సూచనలు… తులసి మొక్కపై ప్రభావం ఏమిటి?

ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది.…

2 hours ago