Analists Dasari Vignan & Damu Balaji : కెమెరాలు లేని చోట వెతుక్కుని చంద్రబాబు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడుకున్నారంటే…: అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ & దాము బాలాజీ

Analists Dasari Vignan & Damu Balaji : నలభై ఏళ్లకే గుండెపోటుతో అర్థాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. ఆయన మరణించి 10 రోజులు కావొస్తుండడంతో ఆయన దశదిన కర్మ కార్యక్రమం మర్చి 2న గురువారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద జరిగింది. ఆ కార్యక్రమంలో అలేఖ్య రెడ్డి అలాగే తన పిల్లలను మోహన్ కృష్ణ, ఆయన కుటుంబం మాట్లాడించకపోవడం పట్ల సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా మరో వైపు తెలుగు దేశం పార్టీ నాయకులందరూ అక్కడ కనిపించడం కూడా చర్చకు దారితీసింది

చంద్రబాబు, విజయసాయి రెడ్డి ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు…

దశదిన కర్మ నాడు అన్నీ తానై బాలకృష్ణ చూసుకున్నాడు. వేదిక పైనే ఉండి అందరినీ పలకరించారు. ఇక మోహన్ కృష్ణ గారు ఆయన కుటుంబం ఉన్నా కూడా కోడలు పిల్లల్ని పలకరించలేదని దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. అందరూ ఉన్నా అక్కడ అనాధ లాగా అలేఖ్య తన పిల్లలు కనిపించారని వారు అభిప్రాయపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది తెలుగుదేశం లీడర్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. అలేఖ్య బాబాయ్ గా విజయసాయి రెడ్డి అక్కడే ఉండగా చంద్రబాబు, విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, కెమెరా లేని చోట పక్కకు వెళ్లి మాట్లాడటం కాస్త ఆసక్తికరంగా అనిపించింది.

ఇంతకుముందు తారకరత్న చనిపోయిన రోజు వాళ్లిద్దరూ కూర్చొని మాట్లాడినపుడు కూడా ఇలాగే చర్చ నడవగా ఆ తరువాత వైసీపీ పార్టీ కొన్ని పదవుల నుండి విజయసాయిని తొలగించింది. చాలా రోజులుగా జగన్ కి విజయ సాయి మధ్య గ్యాప్ ఉంది అన్న మాటలకు నేడు చంద్రబాబు విజయసాయి మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయింది అంటూ దాము బాలాజీ మరియు దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు.