Movie News

Dil Raju: వారిద్దరూ నిర్మాత దిల్ రాజును ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు… సంచలనంగా మారిన కేటీఆర్ వ్యాఖ్యలు!

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు అనే ప్రశ్న ఎదురైతే సమాధానంలో దిల్ రాజు పేరు కూడా ఉంటుంది.ఇలా దిల్ రాజు నిర్మాణంలో వరుస పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా దిల్ రాజు బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బలగం. ఈ సినిమా మార్చి 3వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటి మినిస్టర్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక బలగం సినిమాకి కమెడియన్ వేణు దర్శకత్వం వహించగా హర్షిత, హన్షిత్ ఈ సినిమాకి నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ మాట్లాడుతూ నిర్మాతలు హర్షిత, హన్షిత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రొడ్యూసర్ దిల్ రాజును తొక్కేస్తున్నారని ఆయన సరదాగా మాట్లాడారు.

ఇలా నిర్మాతలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హర్షిత, హన్షిత్ కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆకాంక్షించారు.ఇలా దిల్ రాజు గురించి కేటీఆర్ సరదాగా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక దర్శకుడు వేణు గురించి మాట్లాడుతూ ఆయన ఇలాంటి ఒక మంచి మూవీ చేస్తారని తాను అసలు ఊహించలేదని తెలిపారు.


Dil Raju చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అందుకున్నాయి…

ఇక ఇండస్ట్రీలో బడ్జెట్ కన్నా కథ ముఖ్యమని,చిన్న సినిమాలుగా విడుదలైనటువంటి ఎన్నో చిత్రాలు ఇప్పటికే పెద్ద సినిమాలకు భారీ షాక్ ఇచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. భీమ్స్ ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారని ఇండస్ట్రీలో భీమ్స్ పేరు తెచ్చుకోవాలని ఆయన కామెంట్లు చేశారు. తెలంగాణ భాషకు గౌరవం దక్కడం సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago