Featured

Analyst Damu Balaji : అలేఖ్య రెడ్డి కోసం నిశిక ఏం చేసిందంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : నందమూరి తారకరత్న గారు కుప్పం పాదయాత్రలో పాల్గొనడం, ఆయన అక్కడ తీవ్ర గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ఆపైన బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకోవడం, 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించడం అందరినీ కలచివేసింది. ఇక తారకరత్న గారికి భార్య ముగ్గురు పిల్లలు కాగా ఆయనది ప్రేమ వివాహం. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకుని కుటుంబానికి దూరమయ్యారు. ఇరు కుటుంబాలు తారకరత్న, అలేఖ్య రెడ్దిలను దూరం పెట్టడంతో మొదట్లో ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడ్డారు. అలా సాగుతున్న జీవితంలో ఇప్పుడిప్పుడే కొంచం కుటుంబానికి తారకరత్న చేరువవుతున్నాడు అనే సమయంలో ఇలా మృత్యువు దూరం చేసింది. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి వారి ప్రేమ గురించి పెళ్లి పిల్లలు ఎంత ఇబ్బందులను వారు ఎదుర్కొన్నది అన్ని విషయాలను పోస్ట్ పెట్టి అందరినీ ఎమోషనల్ చేసింది. తరచూ వారికి సంబంధించిన విషయాలను పోస్ట్లు పెడుతూ తెలుపుతున్న అలేఖ్య రెడ్డికి తన పెద్ధ కూతురు నిశిక సపోర్ట్ గా నిలబడటం గురించి అనలిస్ట్ దాము బాలాజీ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అలేఖ్య కోసం నిశిక ఏం చేస్తోందంటే…

తారకరత్న, అలేఖ్య రెడ్డిల పెద్ధ కూతురు నిశిక గురించి దాము బాలాజీ గారు మాట్లాడుతూ తాను అలేఖ్యకు బాగా ధైర్యం చెబుతోందని, తండ్రి మరణాన్ని త్వరగా అంగీకరించి అందులో నుండి బయటికి రాడానికి ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు. తాను సోషల్ మీడియాలో తారకరత్న ఉన్నప్పటి ఫోటోలను అలాగే తన తండ్రి మరణం తరువాత ఫోటోలను మిక్స్ చేసి పోస్ట్ చేస్తూ తండ్రి చీకటిలో విడిచి వెళ్లినా వెలుగు వైపు వెళ్లాలనే అర్థం వచ్చేలా పోస్ట్లు పెట్టడం, తాను పరిస్థితులను ఎంతగా అర్థం చేసుకుందో తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.

నిజానికి చిన్న పిల్లలు రియా, తనయ్ రామ్ ఇద్దరూ విజయసాయి రెడ్డి ఇంట్లోనే ఉండగా పెద్ధ అమ్మాయి, అలేఖ్య రెడ్డి కలిసి ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరు వెళ్లి వచ్చారు. అక్కడికి వెళ్లి వచ్చాక నిశిక పెట్టిన పోస్టులతో మరోసారి వైరల్ అయ్యాయి అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు. అలేఖ్య రెడ్డి కంటే తొందరగా నిశిక తారకరత్న మరణ సంఘటన నుండి బయటపడుతున్నట్లు గా కనిపిస్తోంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

5 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

5 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

5 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

6 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

8 hours ago