Analyst Damu Balaji : మాట మార్చిన సునీత… అసలు వివేకానంద కేసులో ఏమి జరుగుతోంది…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు పూటకో మలుపు తిరుగుతూనే డైలీ సీరియల్ లాగా సాగుతోంది. ఓవైపు ఎంపీ అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉంది అంటూ సిబిఐ ఆయనను అరెస్టు చేయాలని భావిస్తుంటే మరోవైపు అవినాష్ రెడ్డికి ఆ కేసుతో సంబంధం లేదు అంటూ హై కోర్ట్ లో పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన విచారణలో సిబిఐ తరుపున న్యాయవది అవినాష్ రెడ్డిని సిబిఐ కస్టడీ కోరుతూ వాదనలు వినిపించగా అసలు కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదంటూ అవినాష్ రెడ్డి తరుపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అయితే అసలు సిబిఐ వాళ్ళు దర్యాప్తును ఏక పక్షంగా నిర్వహిస్తున్నారు అన్న అపవాదులు కూడా ఉన్నాయి. ఇక ఇటువంటి విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ ఆయన విశ్లేషణ అందించారు.

మట మారుస్తున్న సునీత…

తొలి నుండి కేసులో వివేకానంద రెడ్డి వివాహేతర సంబంధాలు అలాగే సెటిల్మెంట్ గొడవలు అంటూ కేసులు ఎన్నో మలుపులు తిరుగుతున్నా ఒకవైపు అవినాష్ రెడ్డిని సిబిఐ విచారిస్తున్నా మరోవైపు వివేకానంద రెడ్డి కేసులో తొలి నుండి కూతురు సునీత రెడ్డి మాటలు ఒక్కోసారి ఒక్కలాగా ఉంటున్నాయి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆమె మొదట ప్రెస్ మీట్ లో తన తండ్రిని చంపేశారని ఫోన్ వచ్చిందని ఆయన ఫోన్ అలాగే లెటర్ రెండూ ఉన్నాయని, మేము వచ్చేవరకు జాగ్రతగా పెట్టమని చెప్పినట్లు తెలిపారు సునీత రెడ్డి. లెటర్ లో డ్రైవర్ ప్రసాద్ తన మీద దాడి చేసినట్లు ఉందని కూడా వివరించారు. ఇక మళ్ళీ మరో సారి ఇది రాజకీయ హత్య అని టీడీపీ లీడర్ ఆది నారాయణరెడ్డి ఓడిపోతాననే భయంతో మా నాన్నను హత్య చేయించాడు అంటూ ఆరోపించారు.

ఇక ఇప్పుడు వేరేలా మాట్లాడుతున్నారు. ఆమెను కూడా సిబిఐ విచారించాలంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆమె తండ్రితో మాట్లాడటం కూడా లేదని తండ్రి రెండో పెళ్లి ఒక ముస్లిం మహిళను చేసుకోవడంతో వివేకానంద భార్య కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆస్తి విషయంలో రెండో భార్యకు ఆస్తి ఇవ్వాలనుకుంటున్నట్లు కొన్ని విషయాలు జరిగాయని, అందువల్ల హత్య విషయంలో సునీత, ఆమె భర్త మీద కూడా సిబిఐ విచారణ జరిపితే బాగుంటుందని అభిప్రాయాపడ్డారు.