Analyst Damu Balaji : వివేకానంద కేసులో కీలక పరిణామాలు… పదునుగా అవినాష్ తరుపున లాయర్ వాదనలు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం, తాజాగా అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో హాస్పిటల్ లో చేరడంతో ఆయన గడువు కోరడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ తాజాగా కోర్ట్ లో అవినాష్ తరుపు లాయర్ సుమారు ఐదు గంటల పాటు వాదనలు వినిపించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సిబిఐ తప్పుడు విచారణ జరుపుతోంది…

వివేకానంద రెడ్డి కేసులో మొదటి నుండి అవినాష్ రెడ్డి ని సిబిఐ టార్గెట్ చేస్తోందంటూ వాదనలు వినిపిస్తున్నా తాజాగా హై కోర్ట్ లో అవినాష్ రెడ్డి తరుపు లాయర్ కూడా ఈ వాదననే లేవనెత్తారు. మొదటి నుండి కేసులో నేనే వివేకానంద రెడ్డిని చంపాను అని చెప్పిన దస్తగిరి వాంగ్మూలంను వదిలేసి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ల మీద సిబిఐ టార్గెట్ చేసిందని వివరించారు. సుమారు ఐదు గంటల పాటు వాదించిన ఉమామహేశ్వరావు గారు కీలక విషయాలను ప్రస్థావించారని అనలిస్ట్ దాము బాలాజీ పేర్కొన్నారు.

మొదటి నుండి అవినాష్ అరెస్టు కోసం అలాగే భాస్కర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి లకు బెయిల్ రాకుండా సునీత అడ్డుపడుతోంది కానీ తానే చంపాను అని చెబుతున్న దస్తగిరి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నా సునీత ఎందుకు పట్టించుకోలేదు అంటూ వాదించారు. అదీ కాక కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ లో అవినాష్ పేరు, భాస్కర్ రెడ్డి పేర్లు లేకపోయినా కోర్ట్ కి సమర్పించిన వాటిలో చేర్చడం వెనుక కుట్ర దాగుందని తెలిపారు ఉమామహేశ్వర్ రెడ్డి. కేసులో సిబిఐ ఏక పక్షంగా విచారణ సాగిస్తోందని కోర్ట్ కి తెలిపారు.