Featured

Bandla Ganesh tweets : త్రివిక్రమ్ పై బండ్ల ట్వీట్స్… గురూజీ పై అంత కోపం ఎందుకు…!

Bandla Ganesh tweets : సినిమా నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గారి అనుబంధం అందరికీ తెలిసిందే. తనని తాను పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్ల గణేష్ చెప్పుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ కి అయితే ఫ్యాన్స్ మామూలుగా ఎదురుచూడరు. ఈ మధ్య కాలంలో పవన్ సినిమాలకు బండ్ల హాజరు కావడం లేదు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లో పవన్ స్పీచ్ కోసం ఎంత అభిమానూలు ఎదురుచూస్తారో ఆ తరువాత బండ్ల గణేష్ స్పీచ్ కోసం ఎదురుచూస్తారు. ఈ భక్తుడికి ఆ భగవంతుడికి మధ్య గ్యాప్ వచ్చింది. అయినా ఈ భక్తుడు మాత్రం సోషల్మీడియాలో పీకే గురించి పోస్ట్లు పెడుతూ అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంటాడు. అలాంటి బండ్ల గణేష్ తాజాగా గురూజీ అంటూ ఒక టాప్ డైరెక్టర్ గురించి కామెంట్స్ చేసారు.

భక్తుడికి భగవంతుడికి మధ్య గురూజీ…

బండ్ల గణేష్ తనకు జరిగిన ఏదైనా ఇష్యూ గురించి ఓపెన్ గానే చెప్పేస్తుంటాడు. అలానే తన భగవంతుడుకి తనకు మధ్య ఒక గురూజీ వచ్చేసాడని ఏదో ఒక రోజు పక్కకి పోవాల్సిందే అని ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను అంటూ ట్వీట్ చేసారు. అయితే గురూజీ అంటూ సంభోదించడంతో ఇండస్ట్రీలో గురూజీ అని పిలిచేది డైరెక్టర్ త్రివిక్రమ్ గారినే కాబట్టి ఆయన్ని అంటున్నాడని పవన్ కి త్రివిక్రమ్ కి మధ్య మంచి రిలేషన్ ఉండటంతో ఆయనే అని అందరికీ అర్థమైంది.

ఇంతకుముందు కూడా బండ్ల గణేష్ త్రివిక్రమ్ గురించి కామెంట్స్ చేసారు. ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కి తాను రాకుండా కావాలనే చేసాడని పవన్ కి తనకి మధ్య గ్యాప్ సృష్టించాడని చెప్పాడు. ఇప్పుడు మరోసారి గురూజీ అంటూ వరుస ట్వీట్స్ తో టార్గెట్ చేసాడు. అయితే వీటి మీద భగవంతుడు పవన్ స్పందిస్తాడా లేక గురూజీ నే స్పందిస్తాడా అనేది వేచి చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago