Ex IPS Narasaiah : ప్రతిపక్షాలు చంద్రబాబును విమర్శించాలంటే వెన్నుపోటు అనే అంశాన్ని తెరమీదకు తెస్తారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నావ్ అంటూ మాట్లాడుతారు. అయితే అందులో నిజానిజాలు అప్పటి నాయకులకు తప్ప నేటి తరానికి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఎన్టీఆర్ పార్టీని లక్ష్మి పార్వతి చేతిలో పెడుతున్న సమయంలో చంద్రబాబు టీడీపీ పార్టీని కాపాడాడు అంటూ మరో వెర్షన్ మనకు వినిపిస్తుంది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయాల మీద ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన నరసయ్య గారు ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రాజ్యాంగేతర శక్తిగా…
ఎన్టీఆర్ గారు బోలా మనిషి, ఆయన గురించి దగ్గగరగా తెలిసిన వ్యక్తులెవరైనా చెప్పే మొదటి మాట. ఆయన పొగడ్తలకు పడిపోతారంటూ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన నరసయ్య గారు తెలిపారు. ఆయనని పొగిడి పనులు జరుపుకోవాలని చాలా మంది చూస్తుంటారని చెప్పారు. ఇక ఆయన జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక ఆయనకు సేవలు చేయడానికి వచ్చానంటూ వచ్చి పెళ్లి చేసుకున్నాక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టింది అంటూ నరసయ్య తెలిపారు. టీడీపీ శ్రేణుల్లో చాలా మంది నాయకులకు ఆమె జోక్యం నచ్చలేదు. ఎన్టీఆర్ కి అనుకూలంగా ఇదే కొంతమంది మినహాయించి దాదాపు 160 మందికి పైగా ఎమ్మెల్యే లు, అశోక్ గజపతిరాజు దేవేందర్ గౌడ్ వంటి నాయకులను ఎన్టీఆర్ తో ఈ విషయం గురించి మాట్లాడటానికి పంపించగా భార్య రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకోరాదు అంటూ ఆయన వాదించి వారిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలనుకున్నారు అంటూ తెలిపారు.
అలాంటి సమయంలో పార్టీని కాపాడుకోడానికి అందరూ కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. తప్పని పరిస్థితుల్లోనే ఆయన పార్టీ తీసుకున్నారు. ఇక వైశ్రాయ్ హోటల్ లో జరిగిన ఇష్యూలో కూడా లక్ష్మి పార్వతి అక్కడికి రాకుండా ఉండుంటే పార్టీ పక్కకి పోయేది కాదు ఆ సంఘటన జరిగేది కాదు. ఆ చెప్పులు వేసింది కూడా ఆయన మీద కాదు అంటూ చెప్పారు నరసయ్య. రెండు సార్లు చంద్రబాబు పార్టీని కాపాడారు. నాదెండ్ల ఎపిసోడ్ లో కాంప్ రాజకీయాలు చేసినపుడు ఎమ్మెల్యేలను బెంగళూరు తీసుకెళ్లి అక్కడి నుండి హైదరాబాద్ కి తీసుకువచ్చినపుడు కూడా చంద్రబాబు కీలక పాత్ర వహించారు. ఆ నాడు చంద్రబాబు సరిగా చూసుకోకపోయుంటే పార్టీనే ఉండేది కాదు అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…