Featured

Analyst Damu Balaji: వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు కథ ఇదే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసిన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో సిట్ విచారణ సరిగా లేదని వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ కు కేసును సిబిఐకి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరిని ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం కలిగిస్తున్న ఈ కేసులో అసలు కథ ఏమిటి అన్నది అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

సెటిల్మెంట్ లోనే గొడవ అందుకే హత్య…

వివేకానంద రెడ్డి గారు ఆయన ఇంట్లోనే మరణించారు. మర్చి 15, 2019 ఎన్నికల కు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఉదంతంలో వివేకానంద రెడ్డి గారిది హత్య లేక సహజ మరణమా అన్నది మొదట్లో గంధరగోళంగా ఉన్న రాను రాను అది హత్య అన్నది తెలిసింది. అయితే హత్య టీడీపీ పార్టీ వారు చేయించారు అనే వైసీపీ ఆరోపణల నడుమ చివరికి హత్య కేసు తాజాగా ఎంపి అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుందంటూ అనలిస్ట్ బాలాజీ గారు అభిప్రాయపడ్డారు. కేసులో నిందితుడైన దస్తగిరి అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్ములం ప్రకారం బెంగళూరు లోని ఒక ఆస్తి విషయంలో సెటిల్మెంట్ చేయడం వల్ల వివేకానంద రెడ్డి గారికి 8 కోట్లు రాగా ఆ వాటా ఇవ్వకుండా ఉండటంతొ గొడవ జరిగి ఆయనను చంపాలనే ప్లాన్ చేసారు.

అలా అవినాష్ రెడ్డి గారి నెత్రుత్వంలో దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, వివేకాను చంపడానికి ప్లాన్ చేసారు. అలా మార్చి 15 అర్ధరాత్రి వివేకానంద రెడ్డి గారితోనే ఇంటికి వెళ్ళాడు దస్తగిరి, ఇక మిగిలిన వారు ఇంటి వెనుక గోడ దూకి లోపలికి వచ్చారు. లోపలికి వెళ్ళాక ఆయనను తెచ్చుకున్న కత్తితొ నరికి చంపేశారు. ఇదంతా అవినాష్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని దస్తగిరి ఇచ్చిన వాంగ్ములం లో ఉంది. ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉన్న రోజుకో కొత్త కథ తెర మీదకు తీస్తున్నారంటు బాలాజీ అభిప్రాయాపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago