Analyst Damu Balaji : శివ శంకర్ రెడ్డిని ఆయన భార్య పదే పదే ఎందుకు కలుస్తోంది… అప్రూవర్ గా మార్చాలని ప్రయత్నిస్తోంది ఎవరు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి మరణం 2019లో ఎన్నికల ముందు సంచలనం సృష్టించింది. మొదట గుండెపోటు అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేసినా తరువాత రాజకీయ హత్యగా తేల్చారు. అలా అనేక మలుపులు తిరుగుతూ కేసులో ప్రధాన నిందితులుగా దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి ఉమా శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కేసులో చేర్చారు సిబిఐ అధికారులు. అయితే కేసులో ఒక్క అడుగు ముందుకు పడలేదు కానీ ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతూ ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా శివ శంకర్ రెడ్డి విషయంలో సిబిఐ నుండి అప్రూవర్ గా మారమని ఒత్తిడి జరుగుతోందనే కథనాలు వినిపిస్తున్నాయి, వీటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జైలులో ఉన్న శివ శంకర్ రెడ్డి అప్రూవర్ గా మారేనా…

దాము బాలాజీ మాట్లాడుతూ శివ శంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నిందితుడిగా ఉండగా దస్తగిరి కథనం ప్రకారం ఎర్ర గంగిరెడ్డికి డబ్బు ఇస్తానని శివ శంకర్ రెడ్డి చెప్పారు. అలా ఈ కేసులో శివ శంకర్ రెడ్డి నిందితుడిగా మారాడు. ఇక ఆయన భార్య తులసమ్మ వల్లే కేసులో సిబిఐ అధికారి రామ్ సింగ్ ను సుప్రీం కోర్ట్ మార్చింది. అలాగే వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన రెండో పెళ్లి గురించి మొదట చెప్పింది తులసమ్మనే.

ఆమె కథనం ప్రకారం షమీమ్ ను పెళ్లి చేసుకోవడం వారికి ఒక కొడుకు ఉన్నాడు అనే విషయాలతో పాటు హత్య జరిగిన రోజు ఏవో కాగితాలను వెతికారని, ఆస్తి కోసమే హత్య జరిగింది అనే కోణంలో తులసమ్మ చెప్పడం జరిగింది అంటూ బాలాజీ తెలిపారు. ఇక శివ శంకర్ రెడ్డికి బెయిల్ రాకుండా సిబిఐ అడ్డుపడటం వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్లపల్లి జైలులో శివ శంకర్ రెడ్డిని ములాఖత్ అవుతున్న తులసమ్మ ఆయనను అప్రూవర్ గా మారమని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అప్రూవర్ గా మారితే పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఆలోచిస్తున్నారంటూ బాలాజీ తెలిపారు. ఇదంతా సిబిఐ మైండ్ గేమ్ అంటూ అభిప్రాయపడ్డారు.