Featured

Hero Suman : భార్య, కూతురు ఏమి చేస్తున్నారంటే… కూతురు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరం… పెద్ధ స్టార్ హీరో ఇంటికి కోడలిగా కూతురు…: హీరో సుమన్

Hero Suman : తెలుగు వారికి వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు గుర్తొస్తే ఇప్పుడు మాత్రం సుమన్ గారే గుర్తొస్తారు. ఆయన నటించిన అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్రకు ప్రాణం పోశారు. తుళు కుటుంబానికి చెందిన హీరో సుమన్ మొదట తమిళ ఇండస్ట్రీలో ఓ మోస్తరు సినిమాలను చేసాక తెలుగు ఇండస్ట్రీలోకి కుడా అడుగుపెట్టారు. తెలుగులో మొదట ఇద్దరు ఖిలాడీలు సినిమాతో మొదళు పెట్టి ఆ తరువాత తరంగిని, త్రివేణి సినిమాల్లో నటించారు. అయితే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది మాత్రం పెద్ద వంశీ గారి సితార సినిమాతోనే. ఆ సినిమాలో సుమన్ గ్లామర్ కి అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక శోభన బాబు, కృష్ణం రాజు వంటి పెద్ద హీరోలతో కలిసి నటించిన సుమన్ గారు ఆయన నటనకు నంది అవార్డు కుడా అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కూతురు సినిమాలకు దూరం…

మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సుమన్ గారు నేడు తమిళం, తెలుగులో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న ఆయన తన ఫ్యామిలిని ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు. అలాగే ఆయన కూతురు క్లాసికల్ డాన్సర్ అయినా కూడా సినిమాల్లోకి రాలేదు. వీటి గురించి తాజాగా ఇంటర్వ్యూలో చెబుతూ తాను చదువులో టాపర్ అని అందుకే తనని డిస్టర్బ్ చేయలేదని ప్రస్తుతం హ్యూమన్ జెనిటిక్స్ మీద చదువుతోందని అక్కడ టాపర్ గా నిలిచిందని చెప్పారు. తనకు పిల్లలు వాళ్ళ వారసత్వంగా వచ్చే సమస్యల వల్ల బాధపడటం నుండి వారికి ఏదైనా చేయాలని అనుకుంటోంది అందుకే హ్యూమన్ జెనిటిక్స్ చదువుకుంది. తాను చేయాలనుకున్న ఏ మంచి పనికోసమైనా నేను ఉంటాను. డబ్బు ఉన్నవాళ్లు పిల్లల్లో జెనిటికల్ ఇష్యూస్ రాకుండా తల్లి గర్భంలోనే ఉన్నపుడు చికిత్స తీసుకుంటారు. అది పేద వారికి దూరం అందుకే వారి కోసం అందుబాటులోకి తేవాలని నా కూతురు కష్టపడుతోంది అంటూ చెప్పారు.

సినిమాలను చూసి ఏది బాగుంది బాగోలేదు అని అన్ని విషయాలని చెబుతుంది అంటూ సుమన్ తెలిపారు. అయితే సినిమాల్లోకి రావాలనే ఇంట్రస్ట్ లేదంటూ తెలిపారు. ఇక కూతురు కి నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయాలని భావిస్తున్నారట. కాకపోతే తన చదువు కంప్లిట్ అయ్యాక చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇంకా ఎవరనేది ఫిక్స్ చేయలేదని ఒక పెద్ధ స్టార్ హీరో కుటుంబానికి ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago