Movie News

Alia Bhatt: పిల్లల గురించి ఈ ప్రశ్న హీరోలను అడగగలరా.. ఫైర్ అయిన అలియాభట్!

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. చిరకాల ప్రేమికుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న ఆలియా గతేడాది నవంబర్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కూతురితోనే పూర్తి సమయాన్ని గడుపుతుంది. ఇక సోషల్ మీడియా వేదికగా తన కూతురుతో గడిపిన సమయం గురించి అభిమానులతో పంచుకుంటుంది.

ఇక తాజాగా మెట్ గాల ఫ్యాషన్ ఈవెంట్ కోసం నాలుగు రోజులపాటు కూతురికి దూరంగా ఉన్న ఆలియా.. తన కూతురుని బాగా మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ అయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా కి పిల్లల గురించి ఒక ప్రశ్న ఎదురవగా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో.. కెరీర్లో మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తల్లి అవ్వాలని ఎందుకు అనిపించింది? అని విలేకరులు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఆలియా స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఈ క్రమంలో ఆలియా భట్ మాట్లాడుతూ..’ పాప నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పాపకి సంబంధించిన ఎన్నో విషయాలు రణబీర్ ని అడిగారు. కానీ.. కెరీర్ ప్రారంభ దశలో బిడ్డను కనటం ధైర్యమైన నిర్ణయమా ? అని రణబీర్ ని ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ఇలాంటి ప్రశ్నలు కేవలం హీరోయిన్స్ ని ఎందుకు అడుగుతారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

Alia Bhatt: నాకు నచ్చిన పని చేస్తాను….

నా కెరియర్ ప్రారంభమై 10 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు బిడ్డని కనటం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమాలైనా, వ్యక్తిగత జీవితమైనా నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనది అనిపిస్తేనే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. గతంలో పెద్దపెద్ద సినిమాలలో నాకు అవకాశాలు వచ్చినా కూడా వదులుకున్నాను. నాకు నచ్చని పనిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. దయచేసి ఇలాంటి ప్రశ్న మరొకసారి నన్ను అడగద్దు అంటూ ఆలియా సమాధానం ఇచ్చింది. దీంతో ఆలియా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago