Analyst Damu Balaji : సునీతను హెచ్చరించిన హై కోర్ట్ జడ్జి… వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోంది…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం, తాజాగా అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో హాస్పిటల్ లో చేరడంతో ఆయన గడువు కోరడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ తాజాగా కోర్ట్ లో అవినాష్ తరుపు లాయర్ సుమారు ఐదు గంటల పాటు వాదనలు వినిపించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నీ హద్ధుల్లో ఉండు అంటూ సునీత కి చివాట్లు…

హై కోర్ట్ లో సుధీర్ఘంగా సాగిన వాదనలలో అవినాష్ తరుపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు గారు దాదాపు ఆయనకు రెండు గంటల సమయం కేటాయించగా సుధీర్ఘంగా ఆయన ఐదు గంటలు వాదనలు వినిపించారు. అందులో సునీత ఏ విధంగా పిటిషన్స్ వేస్తూ ఇంప్లీడ్ అవుతోంది, అసలు నిందితులను ఎందుకు స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు అంటూ సిబిఐ అలాగే సునీత టార్గెట్ గా వాదించారు. అయితే ఆయన వాదనలు అయిపోయాక సునీత తరుపు న్యాయవాది రవిచంద్ర వాదనలు వినిపించే సమయంలో సునీత మధ్యలో జడ్జి గారిని మాకు అవినాష్ తరుపు లాయర్ కి ఇచ్చిన సమయం ఇవ్వాలని అడిగారట.

దీంతో జడ్జి కోపడ్డారని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసారని బాలాజీ తెలిపారు. ఆమె తరుపు న్యాయవాది సమయం ఎక్కువ ఇవ్వాలని అడిగితే ఒకరకంగా ఉండేది కానీ సునీత అడగడం అగ్రహాన్ని తెప్పించి ఉండవచ్చు అంటూ చెప్పారు. సునీత మొదటి నుండి కేసులో పిటిషన్స్ వేయడం, బెయిల్ పిటిషన్స్ లో ఇంప్లీడ్ అవడం చేస్తూ కొంచం ఆతృత్తగా ఉన్నట్లు కనిపిస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.