Naresh: నరేష్ పవిత్ర మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు నిజ జీవితంలో సహజీవనం చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల అయింది.
నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది.ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ నరేష్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మళ్లీ పెళ్లి సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.
ముఖ్యంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ కి కృష్ణ గారి ఫ్యామిలీ తనకు ఏమాత్రం అడ్డు చెప్పలేదని వారికి కూడా మా రిలేషన్ ఇష్టమేనని తెలియజేశారు. ఇక వీరి వ్యవహారంలోకి మహేష్ బాబు పేరుని కూడా లాగడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈయన మరోసారి మళ్లీ పెళ్లి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఆయనకు అంకితం చేస్తున్నామని తెలిపారు.
మే 31వ తేదీ కృష్ణగారి 81వ జయంతి వేడుక కావడంతో తన మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తాను అంటూ ఈయన కృష్ణ గారికి గురించి ప్రస్తావన తీసుకురావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాని కృష్ణ గారికి అంకితం చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…