Ntr:యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికి విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.
ఇలా వరుస షెడ్యూల్స్ తో బిజీగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పనులకు ఎన్టీఆర్ కాస్త విరామం ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కి కాస్త విరామం దొరకడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ నిమిత్తం వెళ్లారని తెలుస్తుంది. అయితే వారం రోజులపాటు ఎన్టీఆర్ హాలిడే వెకేషన్ లో ఉండబోతున్నారని తిరిగి హైదరాబాద్ చేరుకొని సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారని తెలుస్తోంది. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇక ఈ వెకేషన్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తిరిగి దేవర సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను యువసుధ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…