Anasuya: బుల్లితెర యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మునపటి కంటే కాస్త తక్కువగానే యాక్టివ్ గా ఉన్నారని చెప్పాలి. ఒకప్పుడు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిందని చెప్పాలి. అయితే తాజాగా ఈమె మేకప్ లేకుండా క్లోజప్ షాట్ లో ఒక ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ ఫోటోని ఈమె షేర్ చేస్తూ రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవల్ అంటూ క్యాప్షన్ పెట్టారు అలాగే ఈ ఫోటోకి నో ఫిల్టర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేస్తూ తనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయారని చెప్పుకొచ్చారు అయితే ఈ ఫోటో క్షణాలలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి నెటిజన్స్ మేకప్ లేకపోయినా అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నేచురల్ బ్యూటీ అంటూ ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరికొందరు యధావిధిగా అనసూయని ఈ ఫోటోని ఉద్దేశిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మేకప్ లేకపోవడంతో చర్మంపై ఉన్నటువంటి ముడతలు అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం అచ్చం అమ్మమ్మ లాగే ఉన్నావు అనసూయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.అయితే గత కొద్దిరోజుల క్రితమే తన గురించి వచ్చే ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవడంలేదని అంతకన్నా తనకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…