Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అనసూయకు సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి సక్సెస్ రావడానికి కారణం రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అని చెప్పాలి.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో నటించగా అనసూయ రంగమ్మత్త పాత్రలో నటించారు. ఇకపోతే తాజాగా అనసూయ రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది.
ఈ సినిమాలో అనసూయ వేషధారణ మాట తీరు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూతురు పుట్టింది కదా తనకు రంగమ్మత్త స్టైల్ లోనే శుభాకాంక్షలు ఎలా చెబుతారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ అరే చిట్టిబాబు పాప పుట్టిందంటగా చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు. జాగ్రత్తగా ఉండండే అంటూ అనసూయ రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
చూడముచ్చటగా ఉన్నారు..
ఈ విధంగా అనసూయ మరోసారి చిట్టిబాబు అంటూ పిలవడంతో మరోసారి అభిమానులందరికీ కూడా రంగస్థలం సినిమా గుర్తుకు వస్తుందని చెప్పాలి ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు అనసూయ పుష్ప 2 సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…