Anchor Shyamala : ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు నాటు నాటు పాటకు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు ఇండియన్స్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇప్పుడు సూపర్ క్రిటిక్ అవార్డు నామినేషన్ లిస్ట్ లో హాలీవుడ్ హీరోల సరసన నిలిచి మరోసారి మన ఇండియాకు ప్రైడ్ మొమెంట్ తీసుకొచ్చారు త్రిబుల్ ఆర్ టీం. ఇక రామ్ చరణ్ హాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు పలు కార్యక్రమాలకు హాజరువ్వుతూ అక్కడున్న ప్రేక్షకుల మనసును దోచుకున్నారు.
రామ్ చరణ్ అంటే టాలీవుడ్ లో అసూయ పెరిగింది…
రామ్ చరణ్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా మెల్లగా తన నటన, డాన్స్ లతో నిలదొక్కుకున్నాడు. ఇక ‘రంగస్థలం’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చరణ్ నేడు త్రిబుల్ ఆర్ సినిమాతో మరో మెట్టు ఎక్కేసాడు. ఏకంగా అంతర్జాతీయంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. అమెరికన్ టీవీ షోస్ లో టాప్ లో ఉండే గుడ్ మార్నింగ్ అమెరికా వంటి షోస్ లో పాల్గొన్న తెలుగు వాడిగా సత్తా చాటాడు.
పలువురు హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా రామ్ చరణ్ గురించి ప్రశంసిస్తుంటే మన తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉంది. రామ్ చరణ్ అలాగే మెగా ఫ్యామిలీ మీద కుళ్ళుతోనే కావాలనే ఇండస్ట్రీ మౌనంగా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా యాంకర్ శ్యామల తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నే ప్రశ్నించింది. రామ్ చరణ్ అంటే ఇండస్ట్రీలో అసూయ కుళ్ళు ఉన్నాయా అంటూ ప్రశ్నలు సంధించింది. మరి ఇప్పటకైనా ఇండస్ట్రీ రామ్ చరణ్ సాధిస్తున్న ఘనతలకు ప్రశంసలు అందిస్తుందా లేక మౌనంగా ఉండిపోతుందో చూడాలి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…