Anchor Suma: సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర పై గత మూడు దశాబ్దాలుగా యాంకర్ కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమా ఈవెంట్స్ బుల్లితెర కార్యక్రమాలు అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
సుమ ఒకవైపు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె తన కుటుంబ సభ్యులను, తన టీమ్ ను కూడా చూపిస్తూ వారితో కలిసి సందడి చేస్తూ ఉంటారు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగానే డబ్బు సంపాదిస్తూ ఉంటారు.
తాజాగా సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో ఈమె ఫుడ్ పికిల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ వీడియోని చేశారు. ఇందులో తన భర్త రాజీవ్ కనకాల కూడా ఉన్నారు.అయితే సుమ ప్రమోట్ చేసే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇది వరకు చాలామంది ఉపయోగించారని పెద్దగా అవి టేస్ట్ లేవు నాసిరకం ఫుడ్ అంటూ పెద్ద ఎత్తున ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.
ఇలా సుమా చేసిన ఈ వీడియోకి భారీగా నెగిటివ్ కామెంట్స్ రావడంతో కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ ఇప్పటివరకు యాంకర్ గా భారీగానే సంపాదించావు కదా సుమక్క డబ్బు కోసం ఇలాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి ఆరోగ్యలతో ఆడుకోవడం అవసరమా అంటూ భారీగా ఈమెపై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. సుమ ప్రమోషన్ వీడియో ద్వారా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.
హనుమంతుడిని భక్తితో ఆరాధిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని హిందూ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. అందుకే ప్రతి మంగళవారం, శనివారం…
తెలుగు సినీ పరిశ్రమలో హీరో-హీరోయిన్ల మధ్య వయస్సు తేడా గురించి చర్చలు కొత్తవి కావు. అయితే కొందరు నటులు మాత్రం…
రోజువారీ పనుల్లో చురుకుదనం కోసం సరైన ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్య నిపుణులు తరచూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కుమారుడు తన సొంత తల్లిని అమానుషంగా…
హ్యాపీ డేస్ సినిమాతో యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన “టైసన్” పాత్ర ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాల కోసం ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు. ఇలాంటి…