గలగల మాట్లాడే పక్కింటి అమ్మాయిలా బుల్లి తెర పై సందడి చేసే యాంకర్ ఎవరో మనకు బాగా తెలుసు. 1974 కేరళ లో పుట్టిన సుమ తన తండ్రి బదిలీ రీత్యా సికింద్రాబాద్ కు రావడం జరిగింది. తండ్రి పి.ఎన్.కుట్టి, తల్లి విమల ఎప్పటినుంచో సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్నారు. తన మాతృభాష “కేరళ” అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలరు. దేవదాస్ కనకాల దర్శకత్వంలో “మేఘమాల” సీరియల్ చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
అలా 1999 ఫిబ్రవరి 10న రాజీవ్ కనకాల, సుమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. స్థానికంగా సికింద్రాబాద్ లో నివాసం ఉండటంతో ఆమెకు సహజంగా తెలుగుపై ఆసక్తి పెరుగింది. అలాగే ఆమె చదువుకుంటున్న రోజుల్లో తెలుగును కూడా ఒక సబ్జెక్టు గా తీసుకోవడం వలన తెలుగు భాషపై మరింత పట్టు దొరికేలా ఆమెకు తోడ్పడింది. వీరికి ఒక పాప,బాబు జన్మించారు. అయితే.. సుమ దర్శకరత్న దాసరి దర్శకత్వంలో హీరోయిన్ గా నటించారు. 1996 డిసెంబర్ 12న, ఎస్.మల్లేష్ నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో “కళ్యాణ ప్రాప్తిరస్తు” సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో వక్కంతం వంశీ, సుమ కనకాల, కావ్య హీరోహీరోయిన్లుగా నటించారు. కోటి అందించిన స్వరాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి.
ఒరే..రిక్షా సినిమా తర్వాత దాసరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత పవిత్రప్రేమ, వర్షం, ఢీ, బాదుషా, స్వయంవరం, రావోయి చందమామ లాంటి చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. వెండితెర కంటే బుల్లితెర పైనే యాంకర్ సుమ కి మంచి పేరు వచ్చింది.వేయి పడగలు, మేఘమాల, అన్వేషిత, మందాకిని, జీవనరాగం, ఆరాధన లాంటి ధారావాహికాలలో సుమ నటించారు. అదేవిధంగా లక్కుకిక్కు, పట్టుకుంటే పట్టుచీర, స్టార్ మహిళ, అవాక్కయ్యారా, పంచావతారం, భలే చాన్సులే లాంటి టీవీ కార్యక్రమాలతోపాటు ప్రస్తుతం క్యాష్ అనే ఈటీవీ కార్యక్రమంలో ప్రతి శనివారం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.
ఉత్తమ టీవీ యాంకర్స్ కోసం నిర్వహించిన “లిమ్కా F.F హంట్” కార్యక్రమంలో సుమ విజేతగా నిలిచారు. అలాగే పంచావతారం కార్యక్రమానికి ఉత్తమ వ్యాఖ్యాతగా పురస్కారాన్ని అందుకున్నారు. 2010 సంవత్సరానికి ఉత్తమ యాంకర్ గా లోకల్ టీవీ మీడియా పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.నేటి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు అన్నిటికీ సుమ కనకాల యాంకర్ గా వ్యవహరిస్తుండటం విశేషం.
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…