Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అలాగే ఇండస్ట్రీలో కమెడియన్ గా, విలన్ గా, పలు సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నటుడు బ్రహ్మాజీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన కామెడీ డైలాగ్స్ తో అందరినీ నవ్విస్తున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి బ్రహ్మాజీ తన కొడుకు సంజయ్ రావును ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఈయన స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను బ్రహ్మాజీ తన భుజాలపై వేసుకొని భారీగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటుడు బ్రహ్మాజీ అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా అక్కడికి వెళ్లి ఏకంగా తన కొడుకు సినిమాని ప్రమోట్ చేయమని కోరారు అయితే ఎన్నని చేయాలి ఇప్పటికే ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్ అంటూ అన్ని నాతోనే చేయించావు ఇకపై నా వల్ల కాదు అని అనిల్ చెబుతాడు. దీంతో బ్రహ్మాజీ ఏకంగా కత్తి తీసుకొని అనిల్ పీకపై పెడతారు.
ఇప్పుడు చెప్పు స్లమ్ డాగ్ హస్బెండ్ జులై 29వ తేదీ విడుదలకు సిద్ధమైందని చెప్పు అని చెప్పగా అనిల్ చేసేదేమీ లేక అలాగే చెబుతారు. అనంతరం బ్రహ్మాజీ ఆ కత్తి తీసి పక్కన పెట్టగా అది తీసుకున్నటువంటి అనిల్ సినిమాలను ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చని తెలుసుకున్నాను మన సినిమా ప్రమోషన్లకు ఉపయోగపడుతుందని కత్తి దాచిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…