Star Singer: స్టార్ సింగర్ పై భారీ ట్రోలింగ్స్… ప్రెగ్నెన్సీ నే కారణమా..?
Star Singer: ప్రస్తుత కాలంలో ఎంతోమంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత వారి బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరితో పంచుకుంటారు. ఈ క్రమంలోనే అమెరికన్ పాప్ సింగర్ తన ప్రెగ్నెన్సీ గురించి,తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కి గురైంది.
అయితే సదరు సింగర్ ఇలా ట్రోలింగ్స్ కి గురి కావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…అమెరికన్ పాప్ సింగర్ రిహానా గత కొంతకాలం నుంచి తన ప్రియుడు రాఖీతో కలిసి ప్రేమలో ఉంది. ఇలా అతనితో ప్రేమలో ఉన్న ఈమె పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది.
ఈ విధంగా రిహానా పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో ఈమెను పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రముఖ నైజీరియన్ ఇన్‌ఫ్లూయన్‌సర్ డేనియల్ రేఘా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంతోషపడాల్సినంత గొప్ప పని రీహానా చేయలేదని వెల్లడించారు.
సెలబ్రిటీ అయినా సాధారణ వారైనా వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కనడం ఎంతో మంచి పద్ధతి అని… సింగర్ రిహానాను ఉద్దేశిస్తూ… ఈ పరిస్థితుల నుంచి బయట పడేందుకు ఆ దేవుడు మనల్ని కాపాడాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇలా తన ప్రెగ్నెన్సీ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ కావడంతో.. ఆమె అభిమానులు అసలు మీ అభిప్రాయాన్ని ఎవరు అడిగారు అంటూ డేనియల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిహానాకు ప్రస్తుతం 30 సంవత్సరాలని ఎప్పుడు ఏం చేయాలో తనకు బాగా తెలుసు అంటూ ఆమె అభిమానులు తనకు మద్దతుగా నిలబడ్డారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…