Featured

Astrologer Venu Swamy : ప్రభాస్ జాతకంలో శని ఉంది… ఆయన ఏ సినిమా చేసినా అంతే…: వేణు స్వామి

Astrologer Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత నాగచైతన్య విడిపోయాక వాళ్ళు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నాడు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే నేనని తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతుండే వేణు స్వామి ఇటీవల మద్యం, మాసం గురించి మాట్లాడిన మాటలకు పెద్ద చర్చే జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి హాట్ కామెంట్స్ చేసారు.

ప్రభాస్ జాతకంలో ప్రస్తుత శని…

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి మాట్లాడుతూ ప్రభాస్ జాతకం ప్రకారం ప్రస్తుతం శని ఉందని, అర్ధష్టమ శని నడుస్తోందని, తాను ఎంత ప్రయత్నించినా సినిమా సక్సెస్ కాదని చెప్పారు. ఇక ఆరోగ్యం కూడా అంత బాగా ఏమీ ఉండదంటూ చెప్పారు వేణు స్వామి. తాను చెప్పేవి ఈ రోజు గురించి కాకపోయినా కొద్ది రోజుల్లో అవే జరుగుతాయి అప్పుడు వేణు స్వామి చెప్పాడు కదా అని మీరే అనుకుంటారు అంటూ చెప్పారు.

రామ్ చరణ్ కు సంతానం ఆలస్యమవుతుందని ఏడేళ్ల క్రితం చెబితే అందరూ నెగెటివ్ గా మాట్లాడారు ఇప్పుడు అదే జరిగింది. సమంత, నాగచైతన్య విషయంలోనూ వాళ్ళు కలిసి ఉండరు అని పెళ్లి జరిగిన వెంటనే చెప్పాను కానీ అందరూ ట్రోల్ చేసారు కానీ అదే జరిగింది. ఇక వాళ్ళు విడిపోయాక నాగ చైతన్య జాతకం మారబోతోంది, తాను సినిమాలలో సక్సెస్ అవుతాడు అంటూ చెప్పారు. ఇవి జనవరి 16 2023 నుండి ఈ మార్పులు జరుగుతాయి అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…

3 hours ago

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…

5 hours ago

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…

5 hours ago

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…

6 hours ago

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

6 hours ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

6 hours ago