Balagam Actor: చిరిగిన బట్టలు వేసుకుని తిరిగే వాడిని… రిటైర్ అయినా చేతిలో రూపాయి లేదు: బలగం నటుడు

Balagam Actor: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం బలగం. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటినటులకు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇక ఈ సినిమాలో కేవలం నల్లి బొక్క కోసం అత్తవారింటితో గొడవ పడి అల్లుడి పాత్రలో నటించారు నటుడు మురళీధర్ గౌడ్.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మురళీధర్ గౌడ్ తన కన్నీటి కష్టాల గురించి తెలియజేశారు. తన తల్లిదండ్రులకు ఐదుగురు సంతానమని నలుగురు అన్నదమ్ములు, ఒక కుమార్తె సంతానమని తెలిపారు నాన్న కుటుంబ పోషణ కోసం చాలా దూరం వెళ్లి పనులు చేసుకొనీ వచ్చేవారు.

ఇలా నాన్న సంపాదనతో కుటుంబ పోషణ చాలా భారంగా మారిందని ఏదైనా అవసరమైతే కనీసం చేతిలో పది రూపాయలు కూడా లేని దుర్భర పరిస్థితులలో తాము బ్రతికామని తెలిపారు. ఇక చిన్నప్పుడు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేది కాదని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగే వాడిని అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.ఇలా చిరిగిన చొక్కా వేసుకుని తిరుగుతూ ఉంటే తన స్నేహితుడు తనని ఎగతాళి చేసే వారని ఇప్పటికీ ఆ కష్టాలు అవమానాలు కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయని తెలిపారు.

Balagam Actor:

ఇక తాను చదివి ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 సంవత్సరాల పాటు పని చేశానని తెలిపారు. ఇలా తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ తన కష్టాలు మాత్రం తీరలేదని తెలియజేశారు.27 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే కనీసం చేతిలో రూపాయి లేదని తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని ఈ సందర్భంగా ఈయన తన కష్టాల గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.