Nithin: ఒక సినిమాని అద్భుతంగా ముందుకు నడిపించాలి అంటే డైరెక్టర్ పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పాలి. ఇలా డైరెక్టర్ సినిమాని మొత్తం తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తూ ఉంటారు.ఈ విధంగా ఇండస్ట్రీలోకి ఇప్పటికే ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తూ అద్భుతమైన విషయాలను అందుకుంటున్నారు.
ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా
ఇప్పటికే ఇండస్ట్రీలో నందిని రెడ్డి, సుధా కొంగర వంటి మహిళా దర్శకులు పనిచేస్తున్నారు.అయితే తాజాగా ఇండస్ట్రీకి మరో మహిళా దర్శకురాలు పరిచయం కాబోతోంది అంటూ యంగ్ హీరో నితిన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మరి నీది చెబుతున్నటువంటి ఆ యంగ్ లేడీ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఎంతో మంది సెలబ్రిటీలకు ప్రత్యేకంగా డిజైన్ చేసి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నీరజ కోన ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. 2013 వ సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నీరజ అనంతరం పలు సినిమాలలోని పాటలకు లిరిసిస్ట్ గా పని చేశారు. ఇక ప్రస్తుతం ఈమె ఏకంగా డైరెక్టర్ గా మారబోతున్నారని తెలిపారు.
ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ తనకు చాలా సంతోషంగా ఉందని స్క్రిప్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే నీరజ కోన దర్శకత్వంలో నితిన్ హీరోగా సినిమా చేయబోతున్నారని అర్థమవుతుంది త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె సమంతకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…