Tag Archives: venu

Sudigali Sudheer: మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తున్న సుడిగాలి సుదీర్.. రష్మీ ఎక్కడ అంటూ కామెంట్స్!

Sudigali Sudheer: బుల్లితెర జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమైన సుడిగాలి సుదీర్ బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే అంచలంచెలుగా ఎదుగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బుల్లితెరపై సుడిగాలి సుదీర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో ఏకంగా ఈయనకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుధీర్ గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో సుధీర్ పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అయితే వెండితెరపై కూడా మంచి సక్సెస్ సాధించిన సుధీర్ పలు కార్యక్రమాలలో మాట్లాడుతూ నేను ఈ స్థాయికి వచ్చాను అంటే అందుకు కారణం వేణు అన్న అంటూ పలుసార్లు తెలియజేశారు.

వేణు జబర్దస్త్ లో అవకాశం ఇవ్వటం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఇక వేణు కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ గా మారిపోయారు. బలగం సినిమా ద్వారా డైరెక్టర్ గా వేణు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే తాజాగా వేణు గెటప్ శ్రీను సుధీర్ ముగ్గురు కలిసి వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తోంది.’


Sudigali Sudheer: మ్యాడ్ నెస్ ఎప్పటికీ మారదు…

ఈ క్రమంలోనే ఈ ముగ్గురు మంచు కొండల్లో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోని సుధీర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా మ్యాడ్ నెస్ ఎప్పటికీ మారదు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే రశ్మి ఎక్కడ భయ్యా అంటూ ఈ ఫోటోపై కామెంట్లు పెడుతున్నారు.

Balagam Movie: బలగం డైరెక్టర్ ముందే సినిమాలోని ఎమోషన్ సీన్స్ ను కామెడీ చేశారుగా… ఫైర్ అవుతున్న నెటిజన్స్!

Balagam Movie: ఇటీవల పల్లెటూరి నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి అందరికీ తెలిసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ అద్భుతమైన సినిమాకి కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు.

u

ఇంతకాలం ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించి ఆకట్టుకోవడమే కాకుండా జబర్దస్త్ ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన వేణు బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు.
అయితే తాజాగా ఈ అద్భుతమైన సినిమాని వేణు కళ్ళముందే అపహాస్యం చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో బలగం సినిమా స్పూఫ్ తో స్కిట్ చేశారు.

తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షో కి వేణు అతిథిగా హాజరయ్యారు. దీంతో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ బలగం సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను కూడా వేణు ముందే కామెడీ చేశారు.
తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ కలసి స్కిట్ చేశారు. అలాగే ఈ స్కిట్ చివరిలో యాంకర్ రష్మి కూడా పాల్గొనింది.

Balagam Movie: స్కిట్ లో భాగమైన రష్మీ…


బలగం సినిమాలోని క్లైమాక్స్ లో పాట ఉన్నట్లుగా ఈ స్కిట్ చివర్లో కూడా జబర్దస్త్ ప్రవీణ్ పాట పడుతూ హైపర్ ఆది, రష్మీ ఇలా ఒక్కొక్కరి గురించి కామెడీగా వివరించి అందరినీ నవ్వించాడు. ఈ స్కిట్ చూసి కొందరు నవ్వుకుంటుంటే మరి కొంతమంది మాత్రం దర్శకుడి ముందే సినిమా గురించి ఇలా ఆపహేళన చేయడంతో మండిపడుతున్నారు.

Chiranjeevi: బలగం సినిమా మొగిలయ్యకు సాయం చేసిన చిరంజీవి..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా అవసరమైన వారికి సహాయ సహకారాలు చేస్తూ మెగాస్టార్ గా అందరి మనసుల్లో నిలిచిపోయారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలియగానే చిరంజీవి ముందుకు వచ్చి వారికి సహాయం చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో తాజాగా చిరంజీవి మరొకసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఇలాంటి ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా చిరంజీవి తాను చేసిన సహాయం గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటాడు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన బలగం సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఉన్న ‘తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి ‘ అనే పాట సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. మొగిలయ్య దంపతులు పాడిన ఈ పాట అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంది. అయితే ఒక్క పాటతో మంచి గుర్తింపు పొందింన మొగిలయ్య దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.మొగిలయ్య అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న చిరంజీవి డైరెక్టర్ వేణు కి ఫోన్ చేసి మొగిలయ్య ఆరోగ్యం గురించి వివరాలు ఆరా తీసి వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు.

Chiranjeevi: ఖర్చు మొత్తం భరిస్తానన్న చిరు..’


మొగిలయ్య దంపతులు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మొగిలయ్యకు దీర్ఘాకాలిక మధుమేహం ఉండడంతో కంటిచూపు మందగించింది. దీంతో అతనికి కంటి చూపు తిరిగి వచ్చేలా చికిత్స కోసం ఎంత ఖర్చైనా సరే తానే భరిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చినట్లు వారు వెల్లడించారు. దీంతో మొగిలయ్య దంపతులతో పాటు అభిమానులు కూడా చిరంజీవి చేస్తున్న మంచి పనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Balagam Movie: బలగం సినిమా కోసం నా ఇంటిని ఇస్తే వేణు ఒక థాంక్స్ కూడా చెప్పలేదు… సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంటి ఓనర్!

Balagam Movie: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బలగం.సినిమాలు దమ్ముంటే చిన్న సినిమా ఆయన పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించింది.ఇలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతాలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయి. ఈ సినిమా ఎక్కువ భాగం సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ఉన్న ఇల్లు కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో ఉంది. అయితే తాజాగా ఈ ఇంటి ఓనర్ డైరెక్టర్ వేణు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డైరెక్టర్ వేణు ది మా ఊరే కావడంతో ఒకరోజు తన వద్దకు వచ్చి దిల్ రాజు సినిమా అవకాశం ఇచ్చారు మీ ఇల్లు నాకు కావాలి అని అడిగారు.ఇలా సినిమా కోసం ఇల్లు కావాలి అని అడగడంతో నెలన్నర రోజులపాటు నేను వేరే ఇంట్లో ఉండి తన ఇంటిని సినిమా షూటింగ్ కోసం ఇచ్చాను.సినిమా షూటింగ్ జరిగే ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే షూటింగ్ సమయంలో ఇంటిని తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పారు.

Balagam Movie: డబ్బులు కూడా ఇస్తామన్నారు…

ఇప్పటివరకు తనకు రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత డైరెక్టర్ వేణు కనీసం ఒక ఫోన్ చేసి తనకు థాంక్స్ కూడా చెప్పలేదని ఇంటి ఓనర్ రవీందర్రావు తెలిపారు.మేము డైరెక్టర్ వేణు నుంచి ఇలాంటివి ఏమీ ఆశించలేదు కానీ ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Balagam Actor: చిరిగిన బట్టలు వేసుకుని తిరిగే వాడిని… రిటైర్ అయినా చేతిలో రూపాయి లేదు: బలగం నటుడు

Balagam Actor: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం బలగం. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటినటులకు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇక ఈ సినిమాలో కేవలం నల్లి బొక్క కోసం అత్తవారింటితో గొడవ పడి అల్లుడి పాత్రలో నటించారు నటుడు మురళీధర్ గౌడ్.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మురళీధర్ గౌడ్ తన కన్నీటి కష్టాల గురించి తెలియజేశారు. తన తల్లిదండ్రులకు ఐదుగురు సంతానమని నలుగురు అన్నదమ్ములు, ఒక కుమార్తె సంతానమని తెలిపారు నాన్న కుటుంబ పోషణ కోసం చాలా దూరం వెళ్లి పనులు చేసుకొనీ వచ్చేవారు.

ఇలా నాన్న సంపాదనతో కుటుంబ పోషణ చాలా భారంగా మారిందని ఏదైనా అవసరమైతే కనీసం చేతిలో పది రూపాయలు కూడా లేని దుర్భర పరిస్థితులలో తాము బ్రతికామని తెలిపారు. ఇక చిన్నప్పుడు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేది కాదని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగే వాడిని అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.ఇలా చిరిగిన చొక్కా వేసుకుని తిరుగుతూ ఉంటే తన స్నేహితుడు తనని ఎగతాళి చేసే వారని ఇప్పటికీ ఆ కష్టాలు అవమానాలు కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయని తెలిపారు.

Balagam Actor:

ఇక తాను చదివి ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 సంవత్సరాల పాటు పని చేశానని తెలిపారు. ఇలా తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ తన కష్టాలు మాత్రం తీరలేదని తెలియజేశారు.27 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే కనీసం చేతిలో రూపాయి లేదని తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని ఈ సందర్భంగా ఈయన తన కష్టాల గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Comedian Venu: డైరెక్టర్ గా సక్సెస్ అయిన వేణు ఒకప్పుడు టచప్ బాయ్ గా పని చేశారని మీకు తెలుసా?

Comedian Venu: ఇటీవల విడుదలైన ‘ బలగం ‘ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ సినిమాకు కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన వేణు ఇప్పుడు ‘ బలగం’ సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులు హీరోలుగా మారటం, హీరోలు దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. కానీ ఒక కమెడియన్ దర్శకుడుగా మారి సక్సెస్ అవ్వటం ఇప్పటివరకూ జరగలేదు.

కమెడియన్ గా అందరికీ పరిచయమైన వేణు ఇప్పుడు దర్శకుడిగా మారి హిట్ కొట్టడం మాత్రం నిజంగానే పెద్ద విషయం అనే చెప్పాలి. ఇప్పటివరకు టాలివుడ్ ఇండస్ట్రీ లో డైరెక్టర్‌గా సక్సెస్ అయిన కమెడియన్ ఒక్కరు కూడా లేరు. కానీ ఈ రికార్డు ఇప్పుడు కమెడియన్ వేణు బ్రేక్ చేశాడు. వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శలకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ప్రశంసలతో పాటు పైసల కూడా బాగానే వస్తున్నాయి.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా చిత్ర బృందాన్ని ప్రశంసించాడు. అలాగే కమెడియన్ వేణుని కూడా ఈ సందర్భంగా చిరంజీవి ప్రశంసించాడు. సాధారణంగా ఒక కమెడియన్ డైరెక్టర్‌గా మారితే.. అతడి నుంచి కామెడీ కథనే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ కమెడియన్ గా ఉన్న వేణు మాత్రం కన్నీరు పెట్టించే కథతో బలగంను ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లా తెరకెక్కించారు . ఇదిలా ఉండగా ఇటీవల వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ ప్రయాణం గురించి అందరితో పంచుకున్నాడు.

Comedian Venu: వేణు సక్సెస్ వెనుక ఇంత కష్టం ఉందా…

ఈ క్రమంలో వేణు మాట్లాడుతూ “నేను 1999లో ఇంటి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా కష్టపడినా తర్వాత ఓ చిన్న సినిమాకు ఓ షెడ్యూల్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. తర్వాత ఓ రచయిత దగ్గర ఆరు నెలలు పని చేశాను. ఆ తర్వాత కమెడియన్ చిత్రం శ్రీను అన్న దగ్గర టచప్‌ బాయ్‌గా చేరాను. ఇక అప్పటినుండి సినిమాలలో కమెడియన్ గా నటించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా వేణు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Comedian Venu: ఎట్టకేలకు జబర్దస్త్ వీడడం పై నోరు విప్పిన వేణు… ఆ కారణంతోనే బయటకు వచ్చానంటూ కామెంట్స్!

Comedian Venu: బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎందరో స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు. ఇక ఈ కార్యక్రమం మొదట్లో ఇందులో సందడి చేసినటువంటి వారిలో వేణు ఒకరు. వేణు టీం లీడర్ గా అద్భుతమైన స్కిట్ ఫర్ఫార్మెన్స్ తో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వేణు ఉన్న ఫలంగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు..

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వేణు బయటకు రావడంతో మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఈయన కూడా బయటకు వచ్చారని అందరూ భావించారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వేణు పెద్దగా ఇతర కార్యక్రమాలలో కనిపించలేదు. అయితే ఈయన దర్శకుడిగా మారి తాజాగా బలగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టి రావడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు తనకు మల్లెమాల వారితో ఎలాంటి మనస్పర్ధలు రాలేదని మనస్పర్ధలు కారణంగా బయటికి రాలేదని తెలియజేశారు.

Comedian Venu: సినిమాలపై పిచ్చే కారణం…

సినిమాలపై ఉన్న పిచ్చే తనని జబర్దస్త్ నుంచి బయటకు నడిపించిందని తెలిపారు.ఎలాగైనా సినిమా అవకాశాలను అందుకొని సినిమాలతో బిజీగా ఉండాలన్నదే తన కసి అని తెలిపారు.అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే సినిమా వేటలో పడ్డానని జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు పేరు డబ్బు వస్తున్న కూడా వదిలేసి బయటకు వచ్చానని, ,అంతకుమించి తాను జబర్దస్త్ వదిలి రావడానికి మరే కారణాలు లేవంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Journalist Satish: బలగం కథ క్రెడిట్ మొత్తం నాకే చెందాలి… జర్నలిస్ట్ గడ్డం సతీష్ కామెంట్స్ వైరల్!

Journalist Satish: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడుగా మారి మొదటిసారి ఆయన దర్శకత్వం వహించిన సినిమా బలగం. ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మితమైన ఈ సినిమా మౌత్ టాక్ ద్వారా మంచి సక్సెస్ అందుకుంది.

ఇలా ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమా కాపీ ట్రోలింగ్స్ అంటూ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంది.ప్రముఖ జర్నలిస్ట్ గడ్డం సతీష్ బలగం సినిమా కథ నాదేనని ఆరోపణలు చేశారు.ఈ కథను పచ్చికి అనే పేరుతో తాను 2011వ సంవత్సరంలో రాశానని అయితే ఈ కథ 2014లో నమస్తే తెలంగాణలో బతుకమ్మ మ్యాగజైన్లో ప్రచురితమైందని తెలిపారు.

ఇలా నేను రాసిన పచ్చికి అనే కథ ఆధారంగా ఈ సినిమా చేశారని నేను రాసిన కథలో 90% సినిమాలో ఉందని కేవలం 10 శాతం మాత్రమే మార్పులు చేశారంట గడ్డం సతీష్ పేర్కొన్నారు.సాధారణంగా ఏదైనా ఒక పాటలో కొన్ని పదాలు వాడితేనే కాపీ అంటూ పెద్ద ఎత్తున కేసులు వేస్తున్నారు. అలాంటిది నా కథను సినిమాగా చేసి కమర్షియల్ గా దిల్ రాజు సొమ్ము చేసుకుంటున్నారని ఈయన ఆరోపించారు.

Journalist Satish: చట్టపరంగా ముందుకు వెళ్తా…

ఈ విషయంపై దిల్ రాజు స్పందిస్తూ ఈ సినిమా క్రెడిట్ మొత్తం తనకు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని అలా కాని పక్షంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తాననీ, ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్తాను అంటూ గడ్డం సతీష్ దిల్ రాజుకు సవాల్ చేశారు. ఇలా ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి కాఫీ వివాదాన్ని ఎదుర్కొంటుంది. అయితే ఇప్పటివరకు ఈ వివాదం పై దిల్ రాజు స్పందించకపోవడం గమనార్హం.

Dhanaraj: అతని వల్లే జబర్దస్త్ కి దూరమయ్యాను.. జబర్దస్త్ వదిలి తప్పు చేశా: ధనరాజ్

Dhanaraj: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ధనరాజు ఒకరు.ఈయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అనంతరం టీం లీడర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో సందడి చేసినప్పటికీ జబర్దస్త్ అంత గుర్తింపు మాత్రం తీసుకురాలేకపోయింది.ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాలను తెలియజేశారు. ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మాటీవీలోఅలీ టాకీస్ అనే ఒక కార్యక్రమం వచ్చేది అయితే కొన్ని కారణాలవల్ల ఆలీ ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.

అదే సమయంలో వేణు ఆలీ టాకీస్ కార్యక్రమానికి యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. మనిద్దరం వెళ్దాం అంటూ నన్ను బలవంతం చేసే జబర్దస్త్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఇక్కడ కామెడీ షో అది యాంకర్ గా చేయడం కనుక రెండు ఎంతో విభిన్నమైనవి అంటూ వేణు నచ్చ చెప్పారు. ఇదే విషయం జబర్దస్త్ దీప్తి గారితో చెబితే మీరు అక్కడ కనిపించి ఇక్కడ కనిపిస్తే ఎక్స్ క్లూజివ్ నెస్ పోతుందని చెప్పారు.

Dhanaraj: ఇప్పటికీ ఈ విషయంలో వేణుని తిడుతూ ఉంటా..

ఇక వేణు చెప్పిన మాటలు విని తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి ఆలీ టాకీస్ కార్యక్రమానికి వెళ్లామని అయితే పెద్దగా అక్కడ ఏమి కలిసి రాలేదని చెప్పారు.ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే టీం లీడర్ గా ఉన్నటువంటి తాము తిరిగి కంటెస్టెంట్ గా చేయాల్సి ఉంటుంది. అది నచ్చకే జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నానని అయితే వేణు మాటలు విని నేను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి పెద్ద తప్పు చేశాను. ఇప్పటికీ ఈ విషయంలో తనని తిడుతూనే ఉంటానని ధనరాజ్ వెల్లడించారు.