Dhanaraj: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ధనరాజు ఒకరు.ఈయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అనంతరం టీం లీడర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.
ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో సందడి చేసినప్పటికీ జబర్దస్త్ అంత గుర్తింపు మాత్రం తీసుకురాలేకపోయింది.ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాలను తెలియజేశారు. ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మాటీవీలోఅలీ టాకీస్ అనే ఒక కార్యక్రమం వచ్చేది అయితే కొన్ని కారణాలవల్ల ఆలీ ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.
అదే సమయంలో వేణు ఆలీ టాకీస్ కార్యక్రమానికి యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. మనిద్దరం వెళ్దాం అంటూ నన్ను బలవంతం చేసే జబర్దస్త్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఇక్కడ కామెడీ షో అది యాంకర్ గా చేయడం కనుక రెండు ఎంతో విభిన్నమైనవి అంటూ వేణు నచ్చ చెప్పారు. ఇదే విషయం జబర్దస్త్ దీప్తి గారితో చెబితే మీరు అక్కడ కనిపించి ఇక్కడ కనిపిస్తే ఎక్స్ క్లూజివ్ నెస్ పోతుందని చెప్పారు.
ఇక వేణు చెప్పిన మాటలు విని తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి ఆలీ టాకీస్ కార్యక్రమానికి వెళ్లామని అయితే పెద్దగా అక్కడ ఏమి కలిసి రాలేదని చెప్పారు.ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే టీం లీడర్ గా ఉన్నటువంటి తాము తిరిగి కంటెస్టెంట్ గా చేయాల్సి ఉంటుంది. అది నచ్చకే జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నానని అయితే వేణు మాటలు విని నేను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి పెద్ద తప్పు చేశాను. ఇప్పటికీ ఈ విషయంలో తనని తిడుతూనే ఉంటానని ధనరాజ్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…