Dhanaraj: అతని వల్లే జబర్దస్త్ కి దూరమయ్యాను.. జబర్దస్త్ వదిలి తప్పు చేశా: ధనరాజ్

0
136

Dhanaraj: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ధనరాజు ఒకరు.ఈయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అనంతరం టీం లీడర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో సందడి చేసినప్పటికీ జబర్దస్త్ అంత గుర్తింపు మాత్రం తీసుకురాలేకపోయింది.ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాలను తెలియజేశారు. ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మాటీవీలోఅలీ టాకీస్ అనే ఒక కార్యక్రమం వచ్చేది అయితే కొన్ని కారణాలవల్ల ఆలీ ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.

అదే సమయంలో వేణు ఆలీ టాకీస్ కార్యక్రమానికి యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. మనిద్దరం వెళ్దాం అంటూ నన్ను బలవంతం చేసే జబర్దస్త్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఇక్కడ కామెడీ షో అది యాంకర్ గా చేయడం కనుక రెండు ఎంతో విభిన్నమైనవి అంటూ వేణు నచ్చ చెప్పారు. ఇదే విషయం జబర్దస్త్ దీప్తి గారితో చెబితే మీరు అక్కడ కనిపించి ఇక్కడ కనిపిస్తే ఎక్స్ క్లూజివ్ నెస్ పోతుందని చెప్పారు.

Dhanaraj: ఇప్పటికీ ఈ విషయంలో వేణుని తిడుతూ ఉంటా..

ఇక వేణు చెప్పిన మాటలు విని తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి ఆలీ టాకీస్ కార్యక్రమానికి వెళ్లామని అయితే పెద్దగా అక్కడ ఏమి కలిసి రాలేదని చెప్పారు.ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే టీం లీడర్ గా ఉన్నటువంటి తాము తిరిగి కంటెస్టెంట్ గా చేయాల్సి ఉంటుంది. అది నచ్చకే జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నానని అయితే వేణు మాటలు విని నేను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి పెద్ద తప్పు చేశాను. ఇప్పటికీ ఈ విషయంలో తనని తిడుతూనే ఉంటానని ధనరాజ్ వెల్లడించారు.